AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oo Antava Mava: ‘ఊ అంటావా.. ఊఊ అంటావ మావ’ సాంగ్‌పై సామ్‌ షాకింగ్ రియాక్షన్‌.. ‘నా కాళ్లు ఒణికిపోయాయి, ఇంకెప్పుడూ..’

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ పాన్ ఇండియా మువీ 'పుష్ప: ది రైజ్‌' గత రికార్డులను షేక్‌ చేస్తూ సరికొత్త సంచలనం సృష్టించింది. దక్షిణాదిలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ మువీలోని ప్రతీ సీన్‌, సాంగ్స్‌ ఐకానిక్‌గా మిగిలిపోయాయి. ఇక పుష్ప మువీలో సమంతా రూత్ ప్రభు 'ఊ అంటావా.. మావ' సాంగ్‌ యువతను ఉర్రూతలూగించిందంటే అతిశయోక్తి కాదేమో. 2021లో వచ్చిన ఈ పాట క్రేజ్‌ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు..

Oo Antava Mava: 'ఊ అంటావా.. ఊఊ అంటావ మావ' సాంగ్‌పై సామ్‌ షాకింగ్ రియాక్షన్‌.. 'నా కాళ్లు ఒణికిపోయాయి, ఇంకెప్పుడూ..'
Samantha Ruth Prabhu
Srilakshmi C
|

Updated on: Mar 18, 2024 | 9:20 AM

Share

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ పాన్ ఇండియా మువీ ‘పుష్ప: ది రైజ్‌’ గత రికార్డులను షేక్‌ చేస్తూ సరికొత్త సంచలనం సృష్టించింది. దక్షిణాదిలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ మువీలోని ప్రతీ సీన్‌, సాంగ్స్‌ ఐకానిక్‌గా మిగిలిపోయాయి. ఇక పుష్ప మువీలో సమంతా రూత్ ప్రభు ‘ఊ అంటావా.. మావ’ సాంగ్‌ యువతను ఉర్రూతలూగించిందంటే అతిశయోక్తి కాదేమో. 2021లో వచ్చిన ఈ పాట క్రేజ్‌ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. దక్షిణాదిలో అగ్రకథానాయికగా వెలుగొందుతున్న సామ్‌ ఒక్కసారిగా ఐటెం సాంగ్‌లో కనిపించి అందరినీ షాక్‌కు గురిచేసింది. సమంత డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ ఈ పాట డాన్స్‌ షూటింగ్‌ చేసే సమయంలో చాలా అసౌకర్యంగా ఫీల్‌ అయినట్లు చెప్పుకొచ్చింది.

హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లోని తన పాత్ర ‘రాజి’తో పోల్చుతూ.. ‘ఊ అంటావా మావ’ సాంగ్‌ చేయాలనే నిర్ణయం రాజి (ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజి పాత్ర) లాగా ఉందని నేను భావించాను. సెక్సీగా కనిపించాలనేది నా సబ్జెక్ట్ కాదు. నేను నటిగా, వ్యక్తిగా ఎదిగాను. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని వాటిని అధిగమించాను. కానీ నటిగా ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు చాలా అసౌకర్యంగా, కష్టంగా అనిపిస్తుంది. ఇది నాకు నిజంగా చాలా పెద్ద ఛాలెంజ్. నిజానికి ‘ఊ అంటావా’ మొదటి షాట్‌లో నేను చాలా భయపడిపోయాను. పాట చిత్రీకరిస్తున్నప్పుడు నా కాళ్లు వణికిపోయాయి. చాలా కష్టంగా అనిపించిందంటూ’ తన అనుభవాలను సామ్‌ చెప్పుకొచ్చింది.

ఫ్యూచర్‌లో మళ్లీ ఐటెం సాగ్‌ డ్యాన్స్‌ చేస్తావా అని ఇంటర్వ్యూవర్ అడగ్గా.. ఎప్పటికీ చేయనని సమంత ఖరాఖండీగా చెప్పేసింది. ‘నో, నేను ఇకపై ఇలాంటి ఛాలెంజ్ చేయాలనుకోవడం లేదు’ అని ఆమె చెప్పింది. కాగా పుష్ప మువీ సీక్వెల్‌ ‘పుష్ప 2: ది రూల్’ ప్రస్తుతం ప్రొడక్షన్‌లో ఉంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. ఇక సామ్‌ విషయానికొస్తే.. సమంత చివరిసారిగా కుషీలో కనిపించింది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్ర పోషించిన ఈ లవ్ డ్రామా మువీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఇడియన్‌ వెర్షన్ సిటాడెల్‌లో సామ్ కనిపించనుంది. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ నిర్మాతలు, రాజ్, డికె ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు