Prabhas: బాసులకే బాసు మా ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ అవ్వకముందే ఆ హిందీ సినిమాలో నటించిన డార్లింగ్

ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు డార్లింగ్. ప్రభాస్ కు బాలీవుడ్ లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డార్లింగ్ సినిమాలకు అక్కడ భారీ క్రేజ్ ఉంది.

Prabhas: బాసులకే బాసు మా ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ అవ్వకముందే ఆ హిందీ సినిమాలో నటించిన డార్లింగ్
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 18, 2024 | 9:10 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పెరిగిపోయింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్.. ఆతర్వాత పాన్ వరల్డ్ హీరోగా మారిపోయాడు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు డార్లింగ్. ప్రభాస్ కు బాలీవుడ్ లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డార్లింగ్ సినిమాలకు అక్కడ భారీ క్రేజ్ ఉంది. మనదగ్గర సాహో సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. హిందీలో మాత్రం భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలకంటే ముందే బాలీవుడ్ సినిమాలో నటించారని మీకు తెలుసా..? ఆ సినిమా ఏది..? అందులో హీరో ఎవరో తెలుసా..?

అవును ప్రభాస్ ఓ హిందీ సినిమాలో నటించాడు. స్టార్ హీరోలు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించడం చాలా కామన్. ఇప్పటికే చాలా మంది ఇలా ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించారు. అలాగే హిందీ సినిమాల్లోనూ కనిపిస్తూ ఉంటారు. అలాగే మన డార్లింగ్ ప్రభాస్ కూడా హిందీలో నటించారు. ప్రభాస్ హిందీలో నటించిన సినిమా ఎదో తెలుసా..

ప్రభాస్ హిందీలో ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన యాక్షన్ జాక్సన్ సినిమాలో ప్రభాస్ నటించాడు. ఓ సాంగ్ లో ప్రభాస్ కనిపించాడు. తన డాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ కాకముందే ప్రభాస్ కు బాలీవుడ్ లో క్రేజ్ ఉంది అని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సలార్ 2, కల్కి, స్పిరిట్, రాజా సాబ్ సినిమాల్లో నటిస్తున్నాడు.

ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ఎపిసోడ్..

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ఎపిసోడ్..

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే