Supreme Court: ‘అరకొర వివరాలు వెల్లడిస్తారా?’ ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు సంబంధించి ఎస్‌బీఐ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్‌

ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. బాండ్లను కొనుగోలు చేసిన వారు, నిధులందుకున్న వారి వివరాలను బయట పెట్టే ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌లను ఎందుకు వెల్లడించలేదని ఎస్‌బీఐని నిలదీసింది. ప్రతి బాండ్‌కు సంబంధించిన ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌లతో సహా పూర్తి సమాచారాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 18) కోరింది..

Supreme Court: 'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు సంబంధించి ఎస్‌బీఐ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్‌
Supreme Court
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 19, 2024 | 7:09 AM

న్యూఢిల్లీ, మార్చి 19: ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయడంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. బాండ్లను కొనుగోలు చేసిన వారు, నిధులందుకున్న వారి వివరాలను బయట పెట్టే ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌లను ఎందుకు వెల్లడించలేదని ఎస్‌బీఐని నిలదీసింది. ప్రతి బాండ్‌కు సంబంధించిన ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌లతో సహా పూర్తి సమాచారాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 18) కోరింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను బ్యాంక్ వెల్లడించిందని ధృవీకరిస్తూ గురువారం (మార్చి 21) సాయంత్రం 5 గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

యునిక్‌ బాండ్‌ నంబర్లతో పాటు అన్ని వివరాలను పూర్తిగా వెల్లడించాల్సిందేనని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకూ తావులేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కొనుగోలు చేసిన బాండ్ల ఆల్ఫాన్యూమరిక్ నంబర్ సీరియల్ నంబర్‌ను కలిగి ఉంటుందని మేము స్పష్టం చేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు, బ్యాంకు చైర్‌పర్సన్ తన కస్టడీలో ఉన్న అన్ని వివరాలను వెల్లడించామని, నోడ్‌లను నిలుపుదల చేశామని స్పష్టం చేస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోపు అఫిడవిట్‌ను దాఖలు చేయాలి’ అని సీజేఐ తెలిపారు. ఎస్‌బీఐ నుంచి అందిన వివరాలను వెంటనే తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కీ), అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII).. ఈ మూడు సంస్థలు ఎలక్టోరల్ బాండ్ నంబర్ల విడుదలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. వారి పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అత్యవసర విచారణను కోరారు. అయితే ఇతర దరఖాస్తుదారుల కంటే వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేమని, వారి పిటిషన్‌ విచారణకు జాబితా చేయబడలేదని కోర్టు తోసి పుచ్చింది.

ఇవి కూడా చదవండి

ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగవిరుద్ధమని, కొనుగోలు చేసిన తేదీ/విముక్తి తేదీ, కొనుగోలుదారు/గ్రహీత పేరు, డినామినేషన్‌తో సహా మొత్తం వివరాలను మార్చి 13వ తేదీ కల్లా వెల్లడించాలని ఎస్‌బీఐని ఆదేశిస్తూ రాజ్యాంగ ధర్మాసనం మార్చి 15న చారిత్రక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివరాల వెల్లడికి గడువు కోరుతూ ఎస్‌బీఐ వేసిన పిటిషన్‌ను మార్చి11న సుప్రీం కొట్టివేసింది. అనంతరం ఎస్‌బీఐ ఎలక్టోరల్‌ బాండ్ల అరకొర వివరాలు ఎన్నికల సంఘానికి అందజేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఎస్‌బీఐని సోమవారం సంజాయిషీ కోరింది. మార్చి 1, 2018 నుంచి ఏప్రిల్ 11, 2019 మధ్య విక్రయించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆల్ఫాన్యూమరిక్ నంబర్, కొనుగోలు తేదీ, డినామినేషన్, దాతల పేర్లతో సహా బహిర్గతం చేయాలని కోరుతూ సిటిజన్స్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే రాజ్యాంగ ధర్మాసనం ఈ దరఖాస్తును నిర్వహించలేనిదిగా భావించి కొట్టివేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు 2019 ఏప్రిల్ 12న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుండి ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన తేదీ వరకు విక్రయించిన బాండ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించాని ఎస్‌బీఐని ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే..
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
లక్ష్మీనరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం.. ఎవరు ఇచ్చారంటే
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!