Telangana Governor: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం.. సీఎం రేవంత్‌తో ప్రత్యేక భేటీ
తెలంగాణ ఇంఛార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం (మార్చి 20) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత ఝార్ఖంగ్ గవర్నర్‌గా కొనసాగుతోన్న రాథకృష్ణన్ నేటి నుంచి తెలంగాణకు ఇంఛార్జి గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు..
హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ ఇంఛార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం (మార్చి 20) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత ఝార్ఖంగ్ గవర్నర్‌గా కొనసాగుతోన్న రాథకృష్ణన్ నేటి నుంచి తెలంగాణకు ఇంఛార్జి గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.
తమిళిసై ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము ఆయనను నూతన ఇంఛార్జి గవర్నర్‌గా నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్తో రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాలు, రాష్ట్ర స్థితిగతులపై నూతన గవర్నర్ రాధాకృష్ణన్‌కు సీఎం రేవంత్ వివరించారు.
కాగా రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీలో సీనియర్ నేత. గతంలో ఆ రాష్ట్రానికి బీజేపీ చీఫ్‌గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా పలు కీలక పదవుల్లో పనిచేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి ఆయన ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఝార్ఖంగ్‌తోపాటు తెలంగాణ ఇంఛార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు చోట్లా పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేంత వరకూ సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వర్తిస్తారని మంగళవారం (మార్చి 20) రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. కాగా తెలంగాణకు గవర్నర్లుగా పనిచేసిన ECL నరసింహన్, తమిళిసై సౌందరరాజన్‌తోపాటు సీపీ రాధాకృష్ణన్ ఈ ముగ్గురూ తమిళనాడుకు చెందిన వారే కావడం విశేషం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.