TS Polycet 2024 Postponed: తెలంగాణ పాలిసెట్‌ 2024 పరీక్ష వాయిదా.. కొత్త తేదీ వెల్లడి

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌) 2024 పరీక్ష వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మే 17న పరీక్ష జరగాల్సి ఉంది. తాజా పరిణామంతో మే 24న నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ..

TS Polycet 2024 Postponed: తెలంగాణ పాలిసెట్‌ 2024 పరీక్ష వాయిదా.. కొత్త తేదీ వెల్లడి
TS Polycet 2024 Postponed
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 21, 2024 | 11:12 AM

హైదరాబాద్‌, మార్చి 21: తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌) 2024 పరీక్ష వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మే 17న పరీక్ష జరగాల్సి ఉంది. తాజా పరిణామంతో మే 24న నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య ఓ ప్రకటనలో తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా 7 దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రస్తుతం నామినేషన్లు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో నాలుగో విడుతలో పార్లమెంటరీ ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగో విడుత ఎన్నికలు మే 13వ తేదీన జరుగనున్నాయి. అందుకు ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్‌ 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.

కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2024ను కూడా వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విద్యార్ధులు ఈ విషయాన్ని గమనించవల్సిందగా ఈ సందర్భంగా సూచించారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతీయేట తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ పాలీసెట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్ పాలిటెక్నిక్‌, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఈ ఏడాది నిర్వహిస్తోన్న తెలంగాణ పాలీసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష ద్వారా పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న పశుసంవర్థన – మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు, కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

మహేష్ నా చిన్న తమ్ముడు.. పవన్ వాటికోసం మా ఇంటికి వచ్చేవాడు..
మహేష్ నా చిన్న తమ్ముడు.. పవన్ వాటికోసం మా ఇంటికి వచ్చేవాడు..
మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!