AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Paper Leak: పేపర్‌ లీక్‌ కలకలం.. బీహార్‌ డీఎస్సీ పరీక్ష రద్దు! పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం బయటికి

ఎన్నికల స్టంట్లు అనాలో.. లేదా ఆతృత అనాలో తెలియదు గానీ ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షల నుంచి అకడమిక్‌ పరీక్షల వరకు ప్రశ్నాపత్రాలు వరుసగా లీక్‌ అవుతున్నాయి. ఇదే విధమైన పేపర్‌ లీకులతో గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టుడికి పోయింది. ఏదీఏమైతేనేం.. ఎన్నో ఆశలతో ఉద్యోగ ఆకాంక్షలతో రాత్రిపగలు తేడా లేకుండా కఠినంగా ప్రిపేర్ అయిన నిరుద్యోగులు ఇటువంటి స్టంట్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు..

Bihar Paper Leak: పేపర్‌ లీక్‌ కలకలం.. బీహార్‌ డీఎస్సీ పరీక్ష రద్దు! పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం బయటికి
Bihar Teacher Recruitment Exam 2024 Cancelled
Srilakshmi C
|

Updated on: Mar 21, 2024 | 11:38 AM

Share

పాట్నా, మార్చి 21: ఎన్నికల స్టంట్లు అనాలో.. లేదా ఆతృత అనాలో తెలియదు గానీ ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షల నుంచి అకడమిక్‌ పరీక్షల వరకు ప్రశ్నాపత్రాలు వరుసగా లీక్‌ అవుతున్నాయి. ఇదే విధమైన పేపర్‌ లీకులతో గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టుడికి పోయింది. ఏదీఏమైతేనేం.. కొందరు దురుద్దేశంతో చేసే ఈ విధమైన అనైతిక చర్యల వల్ల ఎన్నో ఆశలతో ఉద్యోగ ఆకాంక్షలతో రాత్రిపగలు తేడా లేకుండా కఠినంగా ప్రిపేర్ అయిన నిరుద్యోగులు ఇటువంటి స్టంట్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షల ప్రశ్నపత్రం లీక్‌ అయింది. పరీక్ష ప్రారంభానికి ముందే ఈ ప్రశ్నపత్రాలు కొందరు వ్యక్తుల చేతిల్లోకి వచ్చినట్లు సమాచారం. దీంతో మార్చి 15న రెండు షిఫ్టుల్లో జరిగిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష 2024లను రద్దు చేస్తున్నట్లు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) బుధవారం ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని కమిషన్‌ తెలిపింది.

ఎకనామిక్ అఫెన్స్ యూనిట్ పాట్నా నుంచి వెలవురించిన వివరాల ప్రకారం.. పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు నిర్ణీత సమయానికి ముందే ఓ ముఠాకు చేరుకున్నాయి. దీనిపై స్పందించిన బీహార్‌ ఆర్థిక నేరాల విభాగం మార్చి 16న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు, చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. కమీషన్ నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి తదుపరి నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక నేరాల విభాగం ప్రామాణిక సాక్ష్యాలను కోరింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిర్దిష్ట అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.

అయితే ఇందుకు సంబంధించి ఏ రకమైన సమాచారం, సీల్డ్ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏ కార్యాలయం/యూనిట్‌తో పంచుకోలేమని కమిషన్‌కు తెలిపింది. అయితే పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. పరీక్షా ప్రక్రియలో పారదర్శకత, సమగ్రతను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో BPSC మార్చి 15న రెండు షిఫ్టుల్లో నిర్వహించిన పాఠశాల ఉపాధ్యాయుల పోటీ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక నేరాల విభాగం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.