AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: వారసత్వంలో అంతర్భాగం ఒడియా వంటకం.. ‘పాఖాలా దిబాసా’ రోజున ధర్మేంద్ర ప్రధాన్ స్పెషల్ ట్రీట్..

ఆధునిక యుగంలో వంటకాలను ప్రోత్సహించడానికి ఒడియా వంటకాలకు ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. 20 మార్చి 2011న పాఖాలా దిబాసా దినోత్సవంగా ప్రకటించారు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఒడిషా వారి ఇష్టమైన వంటకం పాఖాలా దిబాసా దినోత్సవాన్ని మార్చి 20న జరుపుకుంటారు. ఒడిశాలో ఈ వంటకం ఎంత ఇష్టమైనదంటే.. పూరీలోని జగన్నాథ దేవాలయంలో కూడా పాఖాలాను నైవేద్యంగా వడ్డిస్తారు.

Dharmendra Pradhan: వారసత్వంలో అంతర్భాగం ఒడియా వంటకం.. ‘పాఖాలా దిబాసా’ రోజున ధర్మేంద్ర ప్రధాన్ స్పెషల్ ట్రీట్..
Pakhala Dibasa 2024
Shaik Madar Saheb
|

Updated on: Mar 21, 2024 | 11:14 AM

Share

ఆధునిక యుగంలో వంటకాలను ప్రోత్సహించడానికి ఒడియా వంటకాలకు ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. 20 మార్చి 2011న పాఖాలా దిబాసా దినోత్సవంగా ప్రకటించారు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఒడిషా వారి ఇష్టమైన వంటకం పాఖాలా దిబాసా దినోత్సవాన్ని మార్చి 20న జరుపుకుంటారు. ఒడిశాలో ఈ వంటకం ఎంత ఇష్టమైనదంటే.. పూరీలోని జగన్నాథ దేవాలయంలో కూడా పాఖాలాను నైవేద్యంగా వడ్డిస్తారు. పాఖాలా అనేది అన్ని ఒడియా గృహాలలో ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. పఖాలా’ అనేది సంస్కృత పదం ‘ప్రఖ్యాల’ నుంచి ఉద్భవించింది. దీని అర్థం ‘నీటితో కడగడం’.. జగన్నాథునికి ఇష్టమైన ప్రసాదాలలో ఇదొకటి.. అంతర్జాతీయ గుర్తింపు నాటినుంచి మార్చి 20న పాఖాలా దిబాసాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒడిషా వాసులు జరుపుకున్నారు. బుధవారం పఖాలా దిబాసా 2024 సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ రఘుబర్ దాస్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ఇతర నాయకులు ఒడియా కమ్యూనిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్లోబల్ డే రోజున ఒడియా వంటకాలను జరుపుకోవడానికి అంకితం చేయబడిందని.. ఈ ప్రాంతం గొప్ప వంటల వారసత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఒడియా వంటకాల విశిష్ట రుచులను గుర్తించేందుకు, అభినందించేందుకు నాయకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.

ఒడిశా సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం పాఖాల్ డే సందర్భంగా ఒడియా వంటకాలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, మాజీ దౌత్యవేత్త తరంజిత్ సింగ్ సంధు, ప్రొఫెసర్ కిషోర్ బాసాతో కలిసి.. పాఖాల్ డే రోజున ఒడియా ప్రత్యేక వంటకాలను ఆస్వాదిస్తూ ఆరగించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ.. పఖల్ డే.. మెరుగైన భారతదేశానికి ప్రతిబింబంగా అభివర్ణించారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో పఖాలాను ఆస్వాదించడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుందన్నారు. పాఖాలా కేవలం ఒడియా ఆహారం మాత్రమే కాదు.. ఒడిషా సాంస్కృతిక గుర్తింపు.. వారసత్వంలో అంతర్భాగం. ఎక్కువ మంది ప్రజలు ఈ స్వదేశీ ఒడియా డెలికేసీ ఆరోగ్య ప్రయోజనాలను కనుగొనడం.. దానిని వారి ఆహారంలో భాగం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఏకభారత్ శ్రేష్ఠభారత్ అంటూ.. ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్..

పాఖాలాను ప్రోబయోటిక్ వంటకంగా పేర్కొంటారు. పాఖాలా- చిన్న చేపలు, మునగకాయలు, బచ్చలికూర, బడి చురా, ఇతర వంటకాలతో కూడిన పులియబెట్టిన అన్నం.. దీనిని పలు రకాల డిష్ లతో తయారు చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..