Sitting CM Arrest: పదవిలో ఉండగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేయవచ్చా? కానీ ఆ ఇద్దరిని ఎవరూ టచ్ చేయలేరు

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఆమ్‌ ఆద్మి పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం (మార్చి 22) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే పదవిలో ఉండగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయవచ్చా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. దీనికి చట్టం ఏం చెబుతోంది..? అందుకు సంబంధించిన విధివిధానలు ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

Sitting CM Arrest: పదవిలో ఉండగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేయవచ్చా? కానీ ఆ ఇద్దరిని ఎవరూ టచ్ చేయలేరు
Delhi CM Arvind Kejriwal
Follow us

|

Updated on: Mar 22, 2024 | 10:38 AM

న్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఆమ్‌ ఆద్మి పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం (మార్చి 22) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే పదవిలో ఉండగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయవచ్చా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. దీనికి చట్టం ఏం చెబుతోంది..? అందుకు సంబంధించిన విధివిధానలు ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఆ ఇద్దరిని మాత్రం పదవిలో ఉండగా ఎవరూ టచ్‌ చేయలేరు..

చట్టం దృష్టిలో ప్రతి భారతీయుడు సాధారణ వ్యక్తే. ఇందుకు ఎటువంటి నిబంధనలు లేనందువల్ల వారిపై క్రిమినల్‌ నేరం నమోదైతే దేశ ప్రధానమంత్రినైనా అరెస్ట్‌ చేయవచ్చు. పాలకుల నుంచి సాధారణ వ్యక్తుల వరకు ఈ నియమం అందరికీ వర్తిస్తుంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి వీలు లేదు. వీరి పదవీకాలం ముగిసే వారు సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్‌ల నుంచి నిరోధించవచ్చు. ఆర్టికల్‌ 361 ప్రకారం భారత రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు.. వారి అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు. ఈ నిబంధన కింద రాష్ట్రపతి, గవర్నర్ తన పదవికి సంబంధించిన అధికారాలు, విధులను అమలు చేయడం, వారు చేసిన, చేయాలనుకుంటున్న ఏదైనా చర్యకు ఏ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండనవసరం లేదు. ఈ ప్రత్యేక మినహాయింపు ఒక్క రాష్ట్రపతి, గవర్నర్‌లకు మాత్రమే ఉంటుంది. అందువల్ల వారు పదవిలో ఉన్నప్పుడు క్రిమినల్‌ నేరాలలో కూడా అరెస్ట్ చేసే అధికారం ఎవరికీ లేదు. పదవీ విరమన అనంతరం మాత్రమే వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీరి పదవీకాలం ముగిసే వరకు సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్‌ల నుంచి నిరోధించవచ్చు.

చట్టం ముందు అందరూ సమానులే..

కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఈ రక్షణ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమనేది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి కూడా వర్తిస్తుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 (CRPC) నిబంధనల ప్రకారం.. కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేస్తే ఏ వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు. నిందితుడు పరార్‌ అయ్యే అవకాశం ఉందని, సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడని, చట్టపరమైన ప్రక్రియ నుంచి తప్పించుకునే విధంగా ప్రవర్తిస్తాడనడానికి తగిన కారణం ఉంటే మాత్రమే వారిని అరెస్టు చేయాలి. ఈ లెక్కన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేసే అధికారం రాజ్యంగం ప్రకారం ఉంటుంది. అయితే సివిల్ ప్రొసీడ్యూరల్ కోడ్ సెక్షన్ 135 ప్రకారం.. పార్లమెంటు సభ్యులు 40 రోజుల ముందు, 40 రోజుల తర్వాత, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో అరెస్టు చేయడానికి వీలులేదు. మూడు పార్లమెంటు సమావేశాలు ఒక్కొక్కటి 70 రోజులు ఉండటంతో, దాదాపు 300 రోజుల వరకు వీరిని అరెస్ట్ చేసే అధికారం ఉండదు. ఈ రక్షణ కేవలం సివిల్‌ కేసులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర నేరాల విషయంలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులెవరికీ రక్షణ ఉండదు.

ఇవి కూడా చదవండి

పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి ఎవరంటే..

దేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద రాజకీయనాయకుల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఒకరు. విలక్షణమైన వ్యక్తిత్వంతో తమిళనాడు రాష్ట్రానికిపలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి దేశంలో మొట్టమొదటి సారి అరెస్ట్‌ అయిన సిట్టింగ్ ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. గ్రామాలకు కలర్ టీవీ సెట్ల కొనుగోలులో అవినీతికి పాల్పడినందుకు ఆమెను డిసెంబర్ 7, 1996న అరెస్టు చేయగా.. నెలపాటు జైలులో ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.