Telangana: ‘నేనేం తప్పు చేశానమ్మా..?’ మూడోసారీ ఆడబిడ్డే పుట్టిందనీ పసికందును పొలాల్లో విసిరేసిన తల్లి
మగబిడ్డ కావాలని ఎదురు చూసిన ఓ మహిళకు మూడు సార్లు ఆడ పిల్లలే పుట్టారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆ తల్లి చేయకూడని పని చేసింది. కళ్లు కూడా తెరవని పురిటి బిడ్డను నిర్ధాక్షిణ్యంగా గ్రామ శివారులోని పొలాల్లో పడేసింది. పసిబిడ్డను గ్రామంలోని వీధికుక్కలు ఈడ్చుకొచ్చి వీధుల్లో పడేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్‌గ్రామంలో..
కన్నెపల్లి, మార్చి 22: మగబిడ్డ కావాలని ఎదురు చూసిన ఓ మహిళకు మూడు సార్లు ఆడ పిల్లలే పుట్టారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆ తల్లి చేయకూడని పని చేసింది. కళ్లు కూడా తెరవని పురిటి బిడ్డను నిర్ధాక్షిణ్యంగా గ్రామ శివారులోని పొలాల్లో పడేసింది. పసిబిడ్డను గ్రామంలోని వీధికుక్కలు ఈడ్చుకొచ్చి వీధుల్లో పడేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్‌గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన గంగక్క అనే మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురికి ఇటీవల వివాహం జరిగింది. ఇక రెండో కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. అయితే గంగక్కకు మాత్రం కొడుకు కావాలనే ఆశ ఉండేది. ఈ క్రమంలో మగ శిశువు కోసం ఎదురుచూసిన గంగక్క మరోసారి గర్భందాల్చింది. బుధవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మూడోకాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది. మరోవైపు పెండ్లయిన కూతురుండగా, తాను మళ్లీ గర్భం దాల్చడం అవమానంగా భావించింది. అంతే చడీచప్పుడు చేయకుండా పురిటి బిడ్డను గ్రామ శివారులోని పొలాల్లో పడేసింది.
గురువారం ఉదయం శిశువు మృతదేహాన్ని కుక్కలు గ్రామం దగ్గరికి లాక్కొచ్చాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గంగక్కే తన బిడ్డను ఈ విధంగా ఆడ శిశువును కుక్కలపాలు చేసి ఉంటుందని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఎస్సై విజయ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం గంగక్కను అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై విజయ్ మీడియాకు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.