Pawan Kalyan: ఏపీ ఎన్నికలపై జనసేన స్పెషల్ ఫోకస్.. త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్న పవన్ కల్యాణ్..!
ఆంధ్రప్రదేశ్‌లో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు ముందుకెళ్తున్నాయి. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా కసరత్తులు చేస్తున్నాయి. ప్రధానంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, కూటమి క్యాండేట్ల గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకు తగ్గట్లే.. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలు కీలక నేతలకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్‌లో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు ముందుకెళ్తున్నాయి. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా కసరత్తులు చేస్తున్నాయి. ప్రధానంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, కూటమి క్యాండేట్ల గెలుపుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకు తగ్గట్లే.. అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలు కీలక నేతలకు అప్పగించారు. జనసేనలో టిక్కెట్ వివాదాలు, అభ్యర్థుల మధ్య విభేదాలను పరిష్కరించే పనిని నాదెండ్ల మనోహర్‌కు.. జనసేన- టీడీపీ అభ్యర్థుల మధ్య విభేదాల పరిష్కార బాధ్యతలు నాగబాబుకు కేటాయించారు. ఆ మేరకు.. పవన్ ఆదేశాలతో.. ఇరువురు నేతలు రంగంలోకి దిగారు. జనసేన సీటు ఆశించి.. పొత్తులో టీడీపీకి వెళ్లిన చోట.. అసంతృప్త నేతలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచి వారితో మాట్లాడుతున్నారు నాగబాబు. రెండు, మూడు రోజులుగా పార్టీ కార్యాలయంలోనే ఉన్న నాగబాబు.. ఆయా నియోజకవర్గా్ల్లోని అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. టిక్కెట్ దక్కని పలువురు నేతలు.. పార్టీ మారుతుండడంతో వారిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, అమలాపురం, పి.గన్నవరం, భీమిలి, తిరుపతి, గుంటూరు, అనంతపురం నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు. కూటమిలో కలిసి పనిచేసి టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు సహకరించాలంటూ జనసేన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక సముచిత న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తున్నారు నాగబాబు..
అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నం..
ఇక.. జనసేన పార్టీలో చీలిక రాకుండా ఆ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు నాదెండ్ల మనోహర్. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీలోనే అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. దాంతో.. ఒకరికి సీటు దక్కగా.. మరొకరికి చాన్స్ మిస్ అయింది. ఈ క్రమంలోనే.. టిక్కెట్ దక్కని అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా.. విజయవాడ వెస్ట్ జనసేనలో రోజురోజుకీ వివాదం ముదురుతుండడంతో ఇప్పటికే పోతిన మహేష్‌తో మాట్లాడారు మనోహర్. తాజాగా.. రామచంద్రపురం నేతలతో భేటీ అయ్యారు. సీటు తమకే కేటాయించాలంటూ రామచంద్రపురం జనసేన నేతలు.. మంగళగిరి జనసేన ఆఫీస్ ముందు ఆందోళనకు పిలుపునివ్వడంతో వారిని తెనాలి పిలిపించి మాట్లాడారు. వాస్తవానికి.. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అధినేతతో పాటు ఏడుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన జనసేన.. మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రెండు పార్లమెంటు స్థానాలపైనా క్లారిటీకి వచ్చింది. మిగిలిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి చివరి దశ కసరత్తు కొనసాగుతోంది. ఆ ప్రక్రియ.. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు జనసేన అధినేత.
ఉభయ గోదావరి జిల్లాలపై పవన్ మరింత ఫోకస్..
తాజాగా.. హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ అయిన పవన్‌కళ్యాణ్.. ఎన్నికల ప్రచారం, ఉమ్మడి సభలతోపాటు ఇతర అంశాలపై చర్చించారు. ఇవాళ మంగళగిరి జనసేన ఆపీస్‌లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో ఈ సారి గెలిచి చూపిస్తామంటున్న పవన్.. ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా.. ఉభయ గోదావరి జిల్లాలపై మరింత ఫోకస్ పెట్టారు. అలాగే.. కూటమి పార్టీలు పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే.. ఉమ్మడి సభలు, సమావేశాలు, అభ్యర్థుల గెలుపు, ఉమ్మడి మేనిఫెస్టో లాంటి అంశాలకు పవన్ ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారు. మొత్తంగా.. జనసేన పార్టీ మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకవైపు పవన్‌కళ్యాణ్, మరోవైపు నాగబాబు, నాదెండ్ల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోని వర్గాలను సెట్‌రైట్ చేస్తూనే.. టిక్కెట్ దక్కని నేతలను దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కీలక నేతలు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..