APPSC Group 1 Mains: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ 2018.. సింగిల్‌ జడ్జి తీర్పుపై పాక్షిక స్టే విధించిన హైకోర్టు

ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు చేస్తూ మార్చి 13ప రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయా ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ఉద్యోగ గండం ఏర్పడింది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని, ఉద్యోగుల తరఫున న్యాయపోరాటానికి దిగుతామన్న ప్రభుత్వం సింగిల్‌ జడ్జి ఇచ్చి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ వేసింది. తాజాగా దీనిని విచారించిన హైకోర్టు..

APPSC Group 1 Mains: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ 2018.. సింగిల్‌ జడ్జి తీర్పుపై పాక్షిక స్టే విధించిన హైకోర్టు
AP High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 22, 2024 | 8:03 AM

అమరావతి, మార్చి 22: ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌ 1 మెయిన్స్‌ రద్దు చేస్తూ మార్చి 13ప రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయా ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ఉద్యోగ గండం ఏర్పడింది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని, ఉద్యోగుల తరఫున న్యాయపోరాటానికి దిగుతామన్న ప్రభుత్వం సింగిల్‌ జడ్జి ఇచ్చి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ వేసింది. తాజాగా దీనిని విచారించిన హైకోర్టు గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై పాక్షిక స్టే విధించింది. రిట్ పిటిషన్‌ విధించిన జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ (మార్చి 13, 2024 తేదీ) ఆర్డర్‌పై జస్టిస్ రవినాథ్ తిల్హరి, ఎన్. హరినాథ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం పాక్షిక స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు యథాతథంగా కొనసాగే అవకావం కలిగింది.

కాగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2018లో నిర్వహించిన గ్రూప్-I మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాలను పలుమార్లు మ్యానువల్‌గా మూల్యాంకనం చేయడంపై అభ్యంతరం తెలుపుతూ పలువురు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ సింగిల్‌ జడ్జ్‌ గ్రూప్‌ 1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు.

మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసి, ఉత్తర్వులు అందిన తేదీ నుంచి 6 నెలల్లోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. దీనిపై ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. మార్చి 21న విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను మార్చి 27కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే