AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Anjali: విడాకులు తీసుకున్న నిర్మాతతో స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి..! నెట్టింట చక్కర్లు కొడుతోన్న పెళ్లి వార్తలు

దక్షిణాది హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అచ్చతెలుగు నటి ఒక పక్క హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు కథానాయికా ప్రధానమైన కథలు చేస్తూ బిజీగా ఉంది. యంగ్ హీరోల నుంచి స్టార్‌ హీరోల వరకు జోడీగా నటించి అన్ని రకాల పాత్రలతోనూ ప్రేక్షకులను అలరించారు. తెలుగు నాట కెరీర్‌ ప్రారంభించిన ఈ నటి తమిళ సినీ ఇండస్ట్రీలో ఆమెకు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. ఆ విధంగా రామ్‌ దర్శకత్వం వహించిన..

Actress Anjali: విడాకులు తీసుకున్న నిర్మాతతో స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి..! నెట్టింట చక్కర్లు కొడుతోన్న పెళ్లి వార్తలు
Actress Anjali To Marry Divorced Producer
Srilakshmi C
|

Updated on: Mar 24, 2024 | 8:34 AM

Share

దక్షిణాది హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అచ్చతెలుగు నటి ఒక పక్క హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు కథానాయికా ప్రధానమైన కథలు చేస్తూ బిజీగా ఉంది. యంగ్ హీరోల నుంచి స్టార్‌ హీరోల వరకు జోడీగా నటించి అన్ని రకాల పాత్రలతోనూ ప్రేక్షకులను అలరించారు. తెలుగు నాట కెరీర్‌ ప్రారంభించిన ఈ నటి తమిళ సినీ ఇండస్ట్రీలో ఆమెకు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. ఆ విధంగా రామ్‌ దర్శకత్వం వహించిన ‘కట్రదు తమిళ్‌’ మువీతో తమిళంలో అడుగుపెట్టారు. తమిళనాట అంజలి మొదటి సినిమాతోనే కోలీవుడ్ అభిమానులందరినీ వెనక్కి తిరిగి చూసేలా చేసింది. ఈ మువీ తర్వాత అంగడి తేరు, తూంగ నగరం, ఎంగేయుం ఎపోదుమి, వట్టికుచ్చి, ఇరైవి..వంటి ఎన్నో హిట్‌ మువీల్లో మెప్పించారు. ప్రస్తుతం ఆమె శంకర్- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కథానాయకుడు బాలకృష్ణ సరనన రెండోసారి నటిస్తోంది. అయితే ఈ మువీలో అంజలి నెగెటివ్‌ ఛాయలున్న క్యారెక్టర్‌లో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీలీల, ప్రియమణితోపాటు అంజలి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఈ మధ్యనే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టారు అంజలి. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్‌ పనులు కూడా మొదలయ్యాయి.

అయితే అంజలి పెళ్లి వార్తలు నెట్టింట పలుమార్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహమాడి విదేశాల్లో సెటిల్ అయినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలు ఏమాత్రం నిజంకాదని కొట్టిపారేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ‘ఎంగేయుం ఎప్పుడుం’, ‘ఎనక్కు వైడ్త అడగల్’, ‘బెలూన్’ వంటి మువీల్లో నటించినప్పుడు నటుడు జైతో ప్రేమలో పడటం, బ్రేకప్‌ చెప్పుకోవడం కూడా జరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలో నిజం లేదని తామిద్దరం కేవలం స్నేహితులమేనని కొట్టిపారేశారు అంజలి. తాజాగా మరోమారు ఆమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ సారి ఏకంగా విడాకులు తీసుకున్న ఓ స్టార్‌ ప్రొడ్యూసర్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు, త్వరలోనే అతడిని పెళ్లాడనున్నట్లు ప్రచారం సాగుతోంది. విడాకులు తీసుకున్న తెలుగు నిర్మాతతో అంజలి గత ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉందని, త్వరలో వారు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. అంజలిపై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇది కూడా రూమరేనా? లేక నిజమా? అనే విషయం తేలాలంటే దీనిపై అంజలి స్పందిచాల్సిందే.

ఇంతవరకూ తన ప్రేమపై పెదవి విప్పని అంజలి ఓ ఇంటర్వ్యూలో తన విష బంధం గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇండస్ట్రీలో ఓ వ్యక్తితో ఉన్న సంబంధం కారణంగా కెరీర్‌పై దృష్టి పెట్టలేకపోయానని, ఆ సంబంధం రాంగ్ రిలేషన్‌షిప్ అని అంజలి తెలిపింది. తన కెరీర్‌కు అడ్డుగా ఉన్న రిలేషన్‌షిప్ కంటే కెరీర్‌రే ముఖ్యమని తాను భావించినట్లు నటి అంజలి చెప్పుకొచ్చారు. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ నచ్చిన పాత్రలను జాగ్రత్తగా ఎంచుకుని నటన మొదలుపెట్టింది. ఆ విధంగా ఈ ఏడాది విడుదలైన ఏజు కాదల్ ఏడు మలై అనే మువీతో రీ-ఎంట్రీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.