Telangana: నిత్య పెళ్లి కొడుకు నిర్వాకం.. పెళ్లి పేరిట యువతిని మోసగించి రూ.70 లక్షలు స్వాహా

చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి డబ్బు కోసం నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు. మ్యాట్రిమోనీలో ప్రొఫైల్‌ ఒకటి క్రియేట్‌ చేసి యువతులకు వల వేసేవాడు. ఆ తర్వాత యువతుల్ని సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ వరుస మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా రూ.70 లక్షలు కాజేశాడు. అతని మాయమాటలు నమ్మిన యువతి అప్పులు చేసి, బ్యాంకు రుణం, బంగారం తాకట్టుపెట్టి మరీ..

Telangana: నిత్య పెళ్లి కొడుకు నిర్వాకం.. పెళ్లి పేరిట యువతిని మోసగించి రూ.70 లక్షలు స్వాహా
Cyber Crime
Follow us

|

Updated on: Mar 24, 2024 | 7:06 AM

హైదరాబాద్‌, మార్చి 24: చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ ఓ వ్యక్తి డబ్బు కోసం నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు. మ్యాట్రిమోనీలో ప్రొఫైల్‌ ఒకటి క్రియేట్‌ చేసి యువతులకు వల వేసేవాడు. ఆ తర్వాత యువతుల్ని సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ వరుస మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా రూ.70 లక్షలు కాజేశాడు. అతని మాయమాటలు నమ్మిన యువతి అప్పులు చేసి, బ్యాంకు రుణం, బంగారం తాకట్టుపెట్టి మరీ పెద్ద మొత్తంలో సొమ్ము అప్పగించింది. తీరా డబ్బుముట్టిన తర్వాత పత్తాలేకుండా పోయాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ రవీంద్రరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన ద్రోణాదుల రాజేశ్‌ (40) ఆన్‌లైన్‌లో జూదం ఆడుతూ.. అలా వచ్చిన డబ్బుతో విలాస జీవిగం గడిపేవాడు. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మ్యాట్రిమోని వేదికగా పెళ్లి పేరిట యువతుల్ని మోసగించాలని నిర్ణయించుకున్నాడు. తెలుగు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో ప్రొఫైల్‌ జిస్టర్‌ చేసి, పెళ్లి సంబంధాల కోసం యువతుల్ని గాలించేవాడు. అలా ఎవరైనా సంప్రదిస్తే.. వారితో మాట కలిపి కొన్నాళ్లకు సాన్నిహిత్యం అయ్యాక మోసాలకు పాల్పడేవాడు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, అవి తొలగిపోతే పెళ్లి చేసుకుని, హాయిగా ఉందామని వంచించేవాడు. దీంతో మాయగాడి మాటలు నమ్మిన యువతులు రాజేశ్‌కు డబ్బు చెల్లించేవారు. డబ్బు ముట్టగానే పత్తాలేకుండా పోయేవాడు. అలా తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి రాజేశ్‌ గాలం వేశాడు. గతేడాది తెలుగు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, డబ్బు సాయం కావాలని కోరగా.. అతడి మాయమాటలు నమ్మిన యువతి గతేడాది ఏప్రిల్‌లో రూ.2 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత యువతిని నేరుగా కలిసి ఆమెకు దగ్గరైన నిందితుడు తనకు భారీగా అప్పు ఉందని, అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. నిజమేనని భావించిన యువతి బంగారం తాకట్టుపెట్టి, కొంత అప్పు చేసి మొత్తం రూ.70 లక్షలు ఇచ్చింది. సొమ్మంతా వసూలు చేసిన నిందితుడు.. తర్వాత ఆమెను పెళ్లి చేసుకోలేనని ముఖం చాటేశాడు. అందంగా లేవంటూ అసభ్య పదజాలంతో తిట్టాడు. మరోవైపు తీసుకున్న అప్పులు చెల్లించలేక తీవ్ర సమస్యలు పడిన యువతి చివరికి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి, తన గోడునంతా చెప్పుకుని కన్నీటి పర్యాంతమైంది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రాజేశ్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.