Hyderabad: ఏం తెలివిరా నాయనా.. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని ఈ రేంజ్‌లో ఎవరూ వాడి ఉండరు! నీ ముందు ‘పుష్ప’ జుజుబీ..

స్మగ్లింగ్‌లో పుష్పను మించి పోయాడు ఓ ప్రబుద్ధుడు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను సరఫరాకు ఏకంగా ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను ఉపయోగించాడు. వాడి తెలివితేటలు చూసి పోలీసులే కళ్లు తేలేశారు. డ్రగ్స్‌ వినియోగంపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. అందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి మత్తుపదార్థాల అక్రమ రవాణాపై పటిష్ట నిషా ఏర్పాటు చేశారు..

Hyderabad: ఏం తెలివిరా నాయనా.. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని ఈ రేంజ్‌లో ఎవరూ వాడి ఉండరు! నీ ముందు 'పుష్ప' జుజుబీ..
Smuggling Drugs In Oxford Dictionary
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 24, 2024 | 12:45 PM

హైదరాబాద్, మార్చి 24: స్మగ్లింగ్‌లో పుష్పను మించి పోయాడు ఓ ప్రబుద్ధుడు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను సరఫరాకు ఏకంగా ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలను ఉపయోగించాడు. వాడి తెలివితేటలు చూసి పోలీసులే కళ్లు తేలేశారు. డ్రగ్స్‌ వినియోగంపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. అందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి మత్తుపదార్థాల అక్రమ రవాణాపై పటిష్ట నిషా ఏర్పాటు చేశారు. అయినా కొందరు కేటుగాళ్లు అతి తెలివితేటలతో గుట్టుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ మాదిరిగా ఉండే కిట్స్‌లో డ్రగ్స్‌ తరలిస్తూ ఓ వ్యక్తి హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. డీసీపీ చైతన్య తెలిపిన వివరాల ప్రకారం..

మంగళ్‌హాట్‌కు చెందిన గోస్వామి ఆశిష్‌ గిర్‌ (24) అనే వ్యక్తి బట్టల దుకాణంలో పనిచేసేవాడు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణా చేస్తూ రెండేళ్ల క్రితం పోలీసులకు పట్టుబడ్డాడు. అలా చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించాడు. జైలులో ఉన్నప్పుడు ఆశిష్‌కి ఒడిశాకు చెందిన డ్రగ్‌ పెడ్లర్‌ మిలన్‌ దేబంత్‌తో, ముంబైకి చెందిన మరో డ్రగ్‌ డీలర్‌తో పరిచయమైంది. బయటకు వచ్చాక మిలన్‌ నుంచి గంజాయిని కిలో రూ.8 వేలకు కొని రూ.15 వేలకు విక్రయించేవాడు. ముంబయికి చెందిన డీలనఖ నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను గ్రాము రూ.1500 కొని రూ.4 వేలకు అమ్మేవాడు. ఈ క్రమంలో అతడు డ్రగ్స్‌తో వాహనంలో వస్తున్నట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు పక్కా సమాచారం అందింది. మార్చి 22 ఉప్పుగూడ జెండా ప్రాంతంలో ఛత్రినాక పోలీసులు నిఘా ఉంచారు.

ఇవి కూడా చదవండి

అటుగా కారులోవచ్చిన ఆశిష్‌ కారును ఆపిన పోలీసులు తనిఖీలు చేయడంతో కారు డిక్కీలో ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు ఉన్నాయి. మొదట అర్ధం కాలేదు పోలీసులకు… ఆతర్వాత డిక్షనరీలు ఓపెన్‌ చెయ్యగా.. అసలు యవ్వారం బయటికి వచ్చింది. దాదపు 6.225 కిలోగ్రాముల గంజాయి, 18.75 గ్రాముల MDME డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.81 లక్షలు ఉంటుందని డీసీపీ చైతన్య తెలిపాడు. అనంతరం పట్టుబడ్డ డ్రగ్స్‌ను సీజ్‌ చేసి, నిందితుడు ఆశిష్‌ను అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపరిచామని, ఆ తర్వాత జైలుకు తరలించినట్లు ఆయన మీడియాకు వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!