Viral Video: పెళ్లిపత్రికపై ప్రధాని మోదీ ఫోటో.. ఏమని సందేశం ఇచ్చారంటే..
పెళ్ళి అనేది జీవితంలో అతి పెద్ద మలుపు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని ఎంతో ఘనంగా నలుగురు గుర్తుపెట్టుకునేలా జరగాలని కోరుకుంటారు. మరి కొంతమంది పెళ్లి సమయంలో తమ క్రియేటివిటీని ప్రదర్శించాలనుకుంటారు. ముఖ్యంగా వివాహ ఆహ్వాన పత్రికలు అయితే చాలా వింతగానూ, ప్రత్యేకంగానూ తయారు చేయిస్తారు.
పెళ్ళి అనేది జీవితంలో అతి పెద్ద మలుపు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని ఎంతో ఘనంగా నలుగురు గుర్తుపెట్టుకునేలా జరగాలని కోరుకుంటారు. మరి కొంతమంది పెళ్లి సమయంలో తమ క్రియేటివిటీని ప్రదర్శించాలనుకుంటారు. ముఖ్యంగా వివాహ ఆహ్వాన పత్రికలు అయితే చాలా వింతగానూ, ప్రత్యేకంగానూ తయారు చేయిస్తారు. ఈ ఆహ్వాన పత్రికలలో వారు రాయించే విషయాలు కొన్ని చాలా వైరల్ అవుతాయి. సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరుకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకు పెళ్లి సందర్భంగా ప్రింట్ చేయించిన పెళ్లి కార్డ్ ఇప్పుడు వైరల్ అయ్యింది. నందికంటి నరసింహ అనే వ్యక్తి పటాన్ చెరులో బొంగుల వ్యాపారం చేస్తూ ఉంటాడు. కాగా ఇతను ప్రధాని నరేంద్ర మోడీకి వీర అభిమాని. నరసింహ కుమారుడు సాయికుమార్ పెళ్లి పత్రికల్లో ఏకంగా నరేంద్ర మోడీ చిత్రాన్ని ముద్రించి, ‘నా పెళ్ళికి మీరు ఇచ్చే బహుమతి నరేంద్ర మోడీకి ఓటు వేయడమే’ అని ముద్రించి తనకు, తన కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నడు. తమకు ప్రత్యేక బహుమతులు అవసరం లేదు అని నరేంద్ర మోడీ, బిజెపి పార్టీకి ఓటు వేయాలని పెళ్లి పత్రికల్లో పేర్కొన్నారు. ఏకంగా ఈ పెళ్లి పత్రికను బిజెపి పార్టీ శ్రేణులు నరేంద్ర మోడీకి పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..