Dog Funeral: ఈ శునకం పెట్టి పుట్టింది.. అందుకే చనిపోయినా ఘనంగా కార్యక్రమాలు.
విశ్వాసంలో శునకానికి మించి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల్లా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాటితో అనుబంధాన్ని పెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. యజమాని కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి.
విశ్వాసంలో శునకానికి మించి మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల్లా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాటితో అనుబంధాన్ని పెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. యజమాని కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. తాజాగా ఓ కుటుంబం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం చనిపోవడంతో తల్లడిల్లిపోయారు. అంతేనా, మనుషులు చనిపోతే ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో అదే విధంగా సంప్రదాయబద్ధంగా చివరి కర్మలు నిర్వహించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
గోకవరం మండలం పెంటపల్లి లో పెనుగుల రవీంద్ర,బేబీ దంపతులకు నూతన్ అనే కుమారుడు ఉన్నాడు. వీరు గత ఆరేళ్లుగా హచ్ కుక్కను పెంచుకుంటున్నారు. దానిక భీమ్ అని పేరుకూడా పెట్టుకున్నారు. రవీంద్ర దంపతులు ఈ శునకాన్ని తమ రెండవ సంతానంగా భావించి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇక వారి కుమారుడు నూతన్ అయితే ఈ శునకంపై విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు. బీమ్ అంటే అతనికి వల్లమాలిన ప్రేమ. ప్రతి ఏటా దానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపేవారు. అయితే ఆ శునకం హాఠాత్తుగా మృతి చెందింది. దాంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కుక్క మృతితో నూతన్ పరిస్థితి ఇంక చెప్పనక్కర్లేదు. కుక్క మృతకళేబరాన్ని పట్టుకుని గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆ మూగజీవి కోసం అతను విలపించే తీరు అందరినీ కలచి వేసింది. బీమ్ అంత్యక్రియలకు బంధువులు, గ్రామస్తులు కూడా హాజరై మనుషులకు నిర్వహించినట్టు సంప్రదాయబద్ధంగా నిర్వహించడం మరో విశేషం. అంతేకాదు, శునకానికి దశదినకర్మకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. అందుకోసం ఫ్లెక్సీ కూడా వేయించారట. సంప్రదాయబద్ధంగా పెద్దకర్మ నిర్వహించి, ఘననివాళి అర్పించేందుకు ఏర్పాట్లు చేసినట్టు గ్రామస్తులు, బంధువులు తెలిపారు. రోజు అందరూ వచ్చి బీమ్‌కి నివాళులు అర్పించాలని కోరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.