Hyderabad: మ్యాట్రిమోనీలో యువతులకు గేలం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2.71 కోట్లు స్వాహా!

జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడో కేటుగాడు. పెళ్లి పేరిట యువతి, ఆమె బంధువును మోసగించి కోట్ల రూపాయలు కాజేశాడు. మ్యాట్రిమోనీలో యువతిని పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఏకంగా రూ.2.71 కోట్లు వసూలు చేసి ముఖం చేటేశాడు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో పలు మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు ఆదివారం అరెస్టు..

Hyderabad: మ్యాట్రిమోనీలో యువతులకు గేలం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2.71 కోట్లు స్వాహా!
Matrimony Fraud
Follow us

|

Updated on: Mar 25, 2024 | 8:39 AM

హైదరాబాద్‌, మార్చి 25: జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడో కేటుగాడు. పెళ్లి పేరిట యువతి, ఆమె బంధువును మోసగించి కోట్ల రూపాయలు కాజేశాడు. మ్యాట్రిమోనీలో యువతిని పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఏకంగా రూ.2.71 కోట్లు వసూలు చేసి ముఖం చేటేశాడు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో పలు మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ కొత్తపల్లి నర్సింహ, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

విజయవాడ సమీపంలోని పోరంకి గ్రామానికి చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణ (37) అనే వ్యక్తి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, రేసులు వంటి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. చేతిలో డబ్బుల్లేక పోవడంతో షాదీ డాట్‌ కమ్‌ (Shaadi.com) మ్యాట్రిమోనీలో నకిలీ పేర్లతో యువతులకు పెళ్లి ప్రపోజల్స్‌ పంపాడు. ఇలా ఆరుగురు యువుతులు అతని రిక్వెస్ట్‌లు అంగీకరించారు. దీంతో వారి ఫోన్‌ నంబర్లు తీసుకుని తరచూ చనువుగా ఉండేవాడు. పూర్తిగా వారిని తన మాటలతో నమ్మించి మభ్యపెట్టాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని, పార్ట్నర్‌ వీసా రావాలంటే సిబిల్‌ స్కోరు ఎక్కువ ఉండాలని చెప్పాడు. అలా వారిని రుణాలు తీసుకునేలా చేసి ఆ డబ్బును తన ఖాతాలోకి మళ్లించుకునేవాడు.

ఒక్కొక్కరితో.. ఒక్కో పేరుతో..

వంశీకృష్ణ ఒక్కో యువతికి ఒక్కో పేరుతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. తొలుత రిషికుమార్‌ పేరుతో హైదరాబాద్‌లోని మదీనాగూడకు చెందిన యువతి (30)ని సంప్రదించాడు. తాను అమెరికాలో గ్లెన్‌మార్క్‌ ఫార్మాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని, ఆమెను త్వరలో వివాహం చేసుకుంటానని చెప్పాడు. అయితే పార్ట్నర్‌ను అమెరికాకు తనతోపాటు తీసుకెళ్లాలంటే వైఫ్‌ వీసా కోసం సిబిల్‌ స్కోరు 845 కంటే ఎక్కువ ఉండాలని నమ్మబలికాడు. ప్రస్తుతం ఆమె సిబిల్‌ స్కోరు 743 ఉండటంతో.. అది పెరగాలంటే గ్లెన్‌మార్క్‌ కంపెనీ రుణాలు ఇస్తుందని కట్టుకథలు అల్లాడు. అతడి మాయమాటలను యువతి పూర్తిగా నమ్మింది. దీంతో ఆమెతో పర్సనల్ లోన్‌, క్రెడిట్‌ కార్డులు, కారు లోన్‌ తీయించాడు. ఆమెతోపాటు వరుసకు సోదరి అయ్యే యువతిని కూడా ఇలాగే నమ్మించి భారీ మొత్తంలో లోన్‌ తీసుకునేలా చేశాడు. ఇద్దరి వద్ద కలిపి మొత్తం రూ.2.71 కోట్లు కొట్టేశాడు. ఈ మొత్తం డబ్బు అతని ఖాతాలోకి మళ్లించాడు. త్వరలోనే తిరిగి చెల్లిద్దామని చెప్పిన అతను ఆ తర్వాత పత్తాలేకుండా పోయాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ రమేశ్‌ టీం సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తెలంగాణలో 7, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున కేసులున్నట్లు బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..
వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
లెక్కలు మారాయి.. కల్కిలో మహేష్ | ఇది నిజంగా దిమ్మతిరిగే న్యూసేగా.
లెక్కలు మారాయి.. కల్కిలో మహేష్ | ఇది నిజంగా దిమ్మతిరిగే న్యూసేగా.
గర్భంతో ఉన్న నటిని.. 51 సార్లు కత్తితో పొడిచి.. హత్య.
గర్భంతో ఉన్న నటిని.. 51 సార్లు కత్తితో పొడిచి.. హత్య.
సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఆగష్టు 15న రైతు రుణమాఫీ..!
సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఆగష్టు 15న రైతు రుణమాఫీ..!
కూతురిని హీరోయిన్ చేద్దామనుకున్నాడు.. చివరకు పెళ్లి చేస్తున్నాడు.
కూతురిని హీరోయిన్ చేద్దామనుకున్నాడు.. చివరకు పెళ్లి చేస్తున్నాడు.
గర్భవతి అయిన భార్యకు.. బ్రేకప్‌ చెప్పిన హీరో..?
గర్భవతి అయిన భార్యకు.. బ్రేకప్‌ చెప్పిన హీరో..?
మరీ అన్ని కోట్లా..! దిమ్మతిరిగేలా చేస్తున్న త్రిష ఆస్తులు.
మరీ అన్ని కోట్లా..! దిమ్మతిరిగేలా చేస్తున్న త్రిష ఆస్తులు.
'పుష్ప వల్ల ఎలాంటి లాభం లేదు' ఫహాద్ షాకింగ్ కామెంట్స్.
'పుష్ప వల్ల ఎలాంటి లాభం లేదు' ఫహాద్ షాకింగ్ కామెంట్స్.
'ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం..' లెక్క ఎంతో చెప్పేసిన సీఎం జగన్..
'ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం..' లెక్క ఎంతో చెప్పేసిన సీఎం జగన్..