Hyderabad: భార్యతో గొడవ.. నాంపల్లి కోర్టు జడ్జి ఆత్మహత్య! తనకు తాను ఉరిశిక్ష విధించుకున్న న్యాయమూర్తి

ఎన్నో క్లిష్టమైన కేసులకు తీర్పు చెప్పిన జడ్జి తన జీవితంలో ఎదురైన సమస్యను పరిష్కరించుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో తనకు తాను తప్పుడు తీర్పు ఇచ్చుకుని, ఉరి శిక్ష విధించుకున్నాడు. కుటుంబ కలహాలతో కోర్టు జడ్జి ఉరివేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఆదివారం (మార్చి 24) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Hyderabad: భార్యతో గొడవ.. నాంపల్లి కోర్టు జడ్జి ఆత్మహత్య! తనకు తాను ఉరిశిక్ష విధించుకున్న న్యాయమూర్తి
Nampally Court Judge Suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 25, 2024 | 12:23 PM

హైదరాబాద్‌, మార్చి 25: ఎన్నో క్లిష్టమైన కేసులకు తీర్పు చెప్పిన జడ్జి తన జీవితంలో ఎదురైన సమస్యను పరిష్కరించుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో తనకు తాను తప్పుడు తీర్పు ఇచ్చుకుని, ఉరి శిక్ష విధించుకున్నాడు. కుటుంబ కలహాలతో కోర్టు జడ్జి ఉరివేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఆదివారం (మార్చి 24) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట పోచమ్మ బస్తీ శ్రీనిధి రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 402లో నివాసం ఉంటున్న ఏ మణికంఠ (36) నాంపల్లి కోర్టులో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా (ఎక్సైజ్) విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఏడేళ్ల క్రితం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన లలితతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో భార్యభర్తలు ఇద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. మణికంఠ భార్య లలిత పుట్టింట్లోనే ఉంటోంది. మణికంఠ తన ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా మణికంఠ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. అతని తండ్రి ఆస్పత్రిలోనే ఉంటూ తల్లిని చూసుకుంటున్నాడు. దీంతో మణికంఠ ఆదివారం (మార్చి 24) మధ్యాహ్నం తన భార్యకి ఫోన్‌ చేయగా మరోమారు గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మణికంఠ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. వృత్తిపరంగా ఇరువైపులా వాదనలు విని, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని బేరీజు వేసి, ముద్దాయికి శిక్ష విధించే న్యాయమూర్తి.. తన జీవితంలో మాత్రం క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. గొడవ అనంతరం బెడ్ రూంలో ఫ్యాన్‌కి భార్య చున్నీతోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఎంతసేపటికీ మణికంఠ బయటకు రాకపోవడం, తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా మణికంఠ ఫ్యాన్‌కు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మణికంఠ మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. మణికంఠ తండ్రి శ్రీశైలం ఫిర్యాదు మేరకు అంబర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉస్మానియా మార్చురీకి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణికంఠ మృతితో స్థానికంగా విషాదం చోటుచేసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.