Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
బంగారం ధరలు రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో ధరలు నమోదై దూసుకెళ్తున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుదలను నమోదు చేస్తూ.. ఆల్‌టైమ్ రికార్డ్ చేరుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరగడంతో దేశీయంగా బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
బంగారం ధరలు రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో ధరలు నమోదై దూసుకెళ్తున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుదలను నమోదు చేస్తూ.. ఆల్‌టైమ్ రికార్డ్ చేరుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరగడంతో దేశీయంగా బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా.. అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు.. ఆర్థిక అనిశ్చితి కొనసాగడం.. ఇలా అనేక కారణాలతోపాటు.. భౌగోళిక, రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరల్ని శాసిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బులియన్ మార్కెట్ లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 67వేలకు చేరువలో ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 61వేలు దాటింది. తాజాగా, బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ పై రూ.10, సిల్వర్ పై రూ.100 మేర తగ్గింది. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
బంగారం ధరలు ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,290, 24 క్యారెట్ల ధర రూ.66,850 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.61,140, 24 క్యారెట్లు రూ.66,700, చెన్నైలో 22క్యారెట్ల ధర రూ.61,990, 24క్యారెట్లు రూ.67,630 గా ఉంది.. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.61,140, 24క్యారెట్ల రేటు రూ.66,700లుగా ఉంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.61,140, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.66,700లుగా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.77,400, ముంబైలో రూ.77,400, చెన్నైలో రూ.80,400, బెంగళూరులో రూ.76,600, హైదరాబాద్ లో రూ.80,400, విజయవాడ, విశాఖపట్నంలో రూ.80,400లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..