Pension Planning: పెన్షన్ స్కీమ్‌లో ‘సిప్’ కూడా చేయొచ్చు.. చాలా ఈజీ.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపీ)లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చిన్న మొత్తాలను నెలనెలా పెట్టుబడులు పెట్టుకునే అవకాశం ఉండటంతో అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ఎస్‌ఐపీలను పెన్షన్ ప్లాన్లకు కూడా వినియోగించుకోవచ్చని మీకు తెలుసా? నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) ద్వారా ఇది సాధ్యమవుతుంది.

మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపీ)లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చిన్న మొత్తాలను నెలనెలా పెట్టుబడులు పెట్టుకునే అవకాశం ఉండటంతో అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే ఈ ఎస్‌ఐపీలను పెన్షన్ ప్లాన్లకు కూడా వినియోగించుకోవచ్చని మీకు తెలుసా? నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) ద్వారా ఇది సాధ్యమవుతుంది. పదవీ విరమణ కోసం పకడ్బందీ ప్రణాళిక కలిగి ఉన్నవారు ఎన్‌పీఎస్ ద్వారానే ఎస్‌ఐపీలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది క్రమశిక్షణతో కూడిన అనుకూలమైన పద్ధతిని ప్రోత్సహిస్తాయి. ఎస్‌ఐపీలు రూపాయి ధర సగటు ప్రయోజనాన్ని పొందేందుకు ఎన్‌పీఎస్ భాగస్వాములకు అధికారం ఇస్తాయి. ఇది రాబడిని మరింత పెంచేందుకు దొహదం చేస్తాయి.
నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే..
ఎన్‌పీఎస్ అనేది 2004లో ప్రారంభమైన ప్రభుత్వ-ఆధారిత పెన్షన్ పథకం. దీనిని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్వహిస్తుంది. భారతీయ పౌరులకు పదవీ విరమణ ఆదాయాన్ని అందించడం ఎన్‌పీఎస్ లక్ష్యం. ఎన్‌పీఎస్ నిబంధన ప్రకారం.. ఇందులో సబ్‌స్రైబర్స్ వారి పని సంవత్సరాలలో వారి పెన్షన్ ఫండ్ కోసం క్రమం తప్పకుండా కంట్రిబ్యూషన్ అందిస్తారు. ఈ కంట్రిబ్యూషన్లను ఈక్విటీలు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్‌లు, ప్రత్యామ్నాయ ఆస్తులు వంటి వివిధ ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెడతారు. పదవీ విరమణ తర్వాత, సబ్‌స్క్రైబర్‌లు సేకరించిన కార్పస్‌లో కొంత భాగాన్ని ఏకమొత్తంగా ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన మొత్తం సాధారణ పెన్షన్ రూపంలో అందుతుంది. ఎన్‌పీఎస్ పన్ను ప్రయోజనాలు, పెట్టుబడి ఎంపికలలో సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది మన దేశంలో అందుబాటులో ఉన్న ప్రముఖ పదవీ విరమణ పొదుపు ఎంపిక.
ఎన్‌పీఎస్ కింద ఎస్‌ఐపీల్లో పెట్టుబడులు పెట్టేలా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.
- ఎస్‌ఐపీని పెట్టుబడి మోడ్‌గా ఉపయోగించడం వల్ల సులభంగా అవాంతరాలు లేకుండా చేస్తుంది.
- ఎస్‌ఐపీ మీకు సకాలంలో, చిన్న పెట్టుబడుల సౌలభ్యాన్ని క్రమం తప్పకుండా అనుమతిస్తుంది. పేర్కొన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలని చూస్తున్న సబ్‌స్క్రైబర్‌లకు అనువైనదిగా ఉంటుంది.
- ఎస్‌ఐపీని సెటప్ చేయడంతో మీరు ఇకపై మీ ఎన్‌పీఎస్ ఖాతా కోసం ఏకమొత్తంలో చెల్లింపులు చేయనవసరం లేదు కాబట్టి మీ లక్ష్యాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది
- చాలా కాలం పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా ‘పవర్ ఆఫ్ కాంపౌండింగ్’ ప్రయోజనాలను పొందడంలో ఎస్‌ఐపీ మీకు సహాయపడుతుంది.
- రూపాయి కాస్ట్ యావరేజింగ్‌తో మీరు ఇకపై మార్కెట్‌ను చూసుకోవాల్సిన అవసరం లేదు.
ఎన్‌పీఎస్‌లో ఎస్‌ఐపీ రిజిస్ట్రేషన్ ఇలా..
- ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్ పీఆర్‌ఏఎన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. ఆపై ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్ లేదా రెండింటినీ ఎంచుకుని, సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. దానిని ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి.
- న్యూ ఎస్‌ఐపీ రిజిస్ట్రేషన్ ఇన్ ఎస్‌ఐపీని ఎంపిక చేసుకొని సబ్‌మిట్ చేయాలి.
- ఆ తర్వాత సబ్‌స్క్రైబర్ కొన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చెల్లించాలనుకుంటున్న ఎస్‌ఐపీ మొత్తం, టైర్ రకం, ఎస్‌ఐపీ తేదీ, మెచ్యూరిటీ నెల, సంవత్సరం, ఎస్‌ఐపీ ఫ్రీక్వెన్సీ వంటివి ఎంటర్ చేయాలి.
- ఆన్‌లైన్ ఇ-మాండేట్ ప్రక్రియ కోసం సబ్‌స్క్రైబర్ బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి. అదే బ్యాంకు ఖాతా నుంచి మొత్తం డిడక్ట్ అవుతుంది.
- ధృవీకరణ ప్రక్రియ కోసం నమోదు చేసిన వివరాలు ప్రివ్యూ రూపంలో కనిపిస్తాయి. ఒకసారి తనిఖీ చేసుకొని ధ్రువీకరించి కంటిన్యూ పై క్లిక్ చేయాలి.
- ఈ ఎస్‌ఐపీ రిజిస్ట్రేషన్ వివరాలు అధీకృత బ్యాంకుకు వెళ్తుంది. వారి దానిని అథరైజ్ చేసిన తర్వాత ఎస్‌ఐపీ మొత్తం, ఎస్‌ఐపీ ఫ్రీక్వెన్సీ ప్రకారం సబ్‌స్క్రైబర్‌ల బ్యాంక్ ఖాతా నుంచి మొత్తం డెబిట్ అవుతుంది.
- సబ్‌స్క్రైబర్‌లు “స్టేటస్ ఆఫ్ ఎస్‌ఐపీ రిజిస్టర్డ్ ద్వారా తనిఖి చేయొచ్చు. లిస్ట్ ఆఫ్ ఎస్‌ఐపీ ట్రాన్సాక్షన్స్ ద్వారా లావాదేవీల జాబితాను చూడొచ్చు.
ఎన్‌పీఎస్ కింద ఎస్‌ఐపీ రద్దు చేయాలంటే..
- ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్ పీఆర్‌ఏఎన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. ఆపై ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్ లేదా రెండింటినీ ఎంచుకుని, సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. దానిని ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి.
- క్యాన్సిల్ ఎస్‌ఐపీని క్లిక్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి.
- రద్దు చేయాల్సిన ఎస్‌ఐపీని ఎంచుకుని, కంటిన్యూపై క్లిక్ చేయండి.
- మొదటి రెండు ఎస్‌ఐపీ పునరుద్ధరణ తేదీల తర్వాత మీ ఎస్‌ఐపీ రద్దుకు అర్హత పొందుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








