Kidnap: తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్.. ఆపై హత్య! గోనె సంచిలో మూటకట్టి పెరట్లో దాచిన టైలర్..
సాయంత్రం వేళ మసీదులో ప్రార్ధనలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న తొమ్మిదేళ్ల బాలుడిని ఓ టైలర్ కిడ్నాప్ చేశాడు. బాలుడిని హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి, తన ఇంటి పెరట్లో దాచాడు. ఆనక బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.23 లక్షలు కావాలని, లేదంటే తమ కొడుకుని హత్య చేస్తానంటూ బెదిరించాడు. కానీ అంతలోనే పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో..
థానే, మార్చి 26: సాయంత్రం వేళ మసీదులో ప్రార్ధనలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న తొమ్మిదేళ్ల బాలుడిని ఓ టైలర్ కిడ్నాప్ చేశాడు. బాలుడిని హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి, తన ఇంటి పెరట్లో దాచాడు. ఆనక బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.23 లక్షలు కావాలని, లేదంటే తమ కొడుకుని హత్య చేస్తానంటూ బెదిరించాడు. కానీ అంతలోనే పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లోని గోరెగావ్ గ్రామానికి చెందిన సల్మాన్ మౌల్వీ అనే వ్యక్తి స్థానికంగా టైలర్‌గా పరిచేస్తూ జీవనం సాగించే వాడు. అయితే అతను ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. కానీ అతని వద్ద సరిపడా డబ్బు లేదు. దీంతో కిడ్నాప్ పథకం రచించాడు. దీనిలో భాగంగా అదే గ్రామనికి చెందిన ఇబాద్ అనే బాలుడిని కిడ్నాప్ చేసి తల్లిదండ్రుల నుంచి డబ్బు కాజేయాలని కుట్రపన్నాడు. ఆ ప్రకారంగా ఆదివారం సాయంత్ర స్థానిక మసీదులో ప్రార్ధనలు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న బాలుడిని కిడ్నాప్ చేసి, ఓ గోనె సంచిలో కట్టి దాచాడు. అయితే ప్రార్థనల తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంత బాలుడి తల్లిదండ్రులు కంగారు పడిపోయారు. ఊరూవాడా వెతుకులాట ప్రారంభించారు. ఇంతలో టైలర్ సల్మాన్ బాలుడి తండ్రి ముద్దాసిర్‌కు ఫోన్ చేసి, తమ కొడుకు క్షేమంగా ఇంటికి రావాలంటే రూ.23 లక్షల డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అయితే వివరాలు వెల్లడించేలోపే కాల్ డిస్‌కనెక్ట్ అయ్యింది.
దీంతో ఇబాద్ కిడ్నాప్ వ్యవహారం ఆనోటా ఈనోటి పడటంతో గ్రామస్థులంతా వెతుకులాట ప్రారంభించారు. కిడ్నాపర్ దొరికి పోతాడేమోనని భయపడి తన మొబైల్‌లోని సిమ్‌కార్డును తీసి పారేశాడు. అయితే సోమవారం మధ్యాహ్నం నాటికి సల్మాన్ గుట్టును పోలీసులు పసిగట్టారు. పోలీసులు సల్మాన్ ఇంటికి చేరుకుని తనిఖీ చేయగా బాలుడిని హత్య చేసి గోనెసంచిలో మూటకట్టి, ఇంటి వెనుకు పెరట్లో దాచినట్లు గుర్తించారు. దీంతో బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలుడిని హత్య చేయడానికి గల కారణాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని థానే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) డాక్టర్ డిఎస్ స్వామి తెలిపారు. కిడ్నాప్, హత్య కేసులో సల్మాన్ సోదరుడు సఫువాన్ మౌల్వీ ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనితో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.