AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DSC 2024: టెట్‌ అభ్యర్ధులకు మరో బిగ్‌షాక్‌.. ఓపెన్‌ స్కూల్‌ చదివితే డీఎస్సీకి నో ఛాన్స్‌! టెట్‌కు కూడా అనర్హులే..

తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌, టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర సర్కార్ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఓపెన్‌ స్కూల్‌ విధానంలో బీఈడీ కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. వీళ్లు గతంలో నిర్వహించిన టెట్‌ పరీక్షలో..

DSC 2024: టెట్‌ అభ్యర్ధులకు మరో బిగ్‌షాక్‌.. ఓపెన్‌ స్కూల్‌ చదివితే డీఎస్సీకి నో ఛాన్స్‌! టెట్‌కు కూడా అనర్హులే..
Telangana TET candidates
Srilakshmi C
|

Updated on: Mar 28, 2024 | 8:04 AM

Share

హైదరాబాద్‌, మార్చి 28: తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌, టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర సర్కార్ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఓపెన్‌ స్కూల్‌ విధానంలో బీఈడీ కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. వీళ్లు గతంలో నిర్వహించిన టెట్‌ పరీక్షలో అర్హత సాధించినప్పటికీ డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి నిరాకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. విద్యాశాఖ తాజా నిర్ణయంతో దాదాపు 25 వేల మంది అభ్యర్ధులు డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది.

తెలంగాణ రాష్ట్రంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌ గతంలో ఇంటర్‌ ఉత్తీర్ణత పొందిన వారికి డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కింద సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహించింది. వీటిని రెగ్యులర్‌ డీఎడ్‌ కోర్సులతో సమానంగా భావిస్తారిన అప్పట్లో ప్రచారం కూడా చేశారు. దీంతో అనేక మంది ఈ కోర్సులు చేశారు. ఓపెన్‌ స్కూల్‌ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌ పరీక్షలకు పలుమార్లు హాజరయ్యారు కూడా. టెట్‌ దరఖాస్తు ఫాంలో అర్హత కాలంలో డీఎడ్‌కు బదులు ‘ఇతరులు’అనే కాలంతో వీళ్లు దరఖాస్తు చేసుకునే వాళ్లు. కానీ ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో కీలక తీర్పు వెలువరించింది.

రెగ్యులర్‌ డీఎడ్‌తో ఓపెన్‌ డీఎడ్‌ కోర్స్ సమానం కాదని స్పష్టం చేసింది. నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ ఇచ్చే సర్టిఫికెట్‌ కేవలం ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా పనిచేసేందుకు మాత్రమే అర్హత ఉటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కూడా ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తోంది. దీంతో ఈసారి నిర్వహించనున్న టెట్‌, డీఎస్సీకి ఇప్పటికే ఓపెన్‌ అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసి ఉంటే, వెరిఫికేషన్‌లో వారదరినీ పక్కన పెట్టాలని యోచిస్తున్నారు. మునుముందు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వస్తోందని, ఓసెన్‌ డీఎడ్ కోర్సులను పరిగణనలోకి తీసుకోబోమని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.