AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Coaching for UPSC Civils 2025: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచిత కోచింగ్‌.. ఏప్రిల్ 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ప్రతిష్టాత్మక యూపీఎస్సీ-సీశాట్‌ 2025 పరీక్ష కోసం ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్‌ స్టడీ సర్కిల్‌, మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ మెదక్‌ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి జెమ్లానాయక్‌ బుధవారం (మార్చి 27) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన కింద మొత్తం వంద మంది మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మొత్తం సీట్లలో..

Free Coaching for UPSC Civils 2025: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచిత కోచింగ్‌.. ఏప్రిల్ 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ
UPSC Free Coaching
Srilakshmi C
| Edited By: TV9 Telugu|

Updated on: Mar 07, 2025 | 5:17 PM

Share

మెదక్‌, మార్చి 28: ప్రతిష్టాత్మక యూపీఎస్సీ-సీశాట్‌ 2025 పరీక్ష కోసం ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్‌ స్టడీ సర్కిల్‌, మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ మెదక్‌ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి జెమ్లానాయక్‌ బుధవారం (మార్చి 27) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన కింద మొత్తం వంద మంది మైనార్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మొత్తం సీట్లలో మహిళా అభ్యర్థులకు 33.33శాతం సీట్లు, దివ్యాంగులకు 5 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన సూచించారు. ప్రవేశ పరీక్ష ద్వారా అర్హులైన అభ్యర్ధులను ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.

హైదరాబాద్‌ మైనార్టీ స్టడీసర్కిల్‌లో మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులు మాత్రమే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. అయితే దరఖాస్తు దారుల కుటుంబం వార్షిక ఆదాయం ఏడాదికి రూ.5 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్హతల కింద డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నారు. పై అన్నీ అర్హతలున్న మైనార్టీ అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 12, 2024వ తేదీలోగా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సివిల్స్‌ ఉచిత కోచింగ్‌కు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 28, 2024వ తేదీన ఉంటుందని అన్నారు. ఇతర సందేహాలు, వివరాల కోసం 040-23236112 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

యూపీఎస్సీ-సీశాట్‌ 2025 పరీక్ష కోసం ఉచిత కోచింగ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ