Dairy Farm: డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం.. యూఎస్‌లో జాబ్ వదిలేసి మరీ సక్సెస్ అయిన యువకుడు
కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తూ లైఫ్‌లో సక్సెస్ అవుతూ ఉంటారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు యూఎస్ ఇంటెల్‌లోని జాబ్ వదిలేసి మరీ డెయిరీ ఫామ్ పెట్టి సక్సెస్ అయ్యాడు. కిషోర్ ఇందుకూరి అనే డెయిరీ వ్యాపారవేత్త 44 కోట్ల వార్షిక ఆదాయంతో సిడ్ డెయిరీ ఫామ్‌తో సక్సెస్ అయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన కిషోర్ ఇందుకూరి మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు.
భారతదేశంలో చాలా మంది విద్యార్థులు ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కంటూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తూ లైఫ్‌లో సక్సెస్ అవుతూ ఉంటారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు యూఎస్ ఇంటెల్‌లోని జాబ్ వదిలేసి మరీ డెయిరీ ఫామ్ పెట్టి సక్సెస్ అయ్యాడు. కిషోర్ ఇందుకూరి అనే డెయిరీ వ్యాపారవేత్త 44 కోట్ల వార్షిక ఆదాయంతో సిడ్ డెయిరీ ఫామ్‌తో సక్సెస్ అయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన కిషోర్ ఇందుకూరి మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. అతని తండ్రి, నరసింహరాజు, మహీంద్రా & మహీంద్రాలో 25 సంవత్సరాలు ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అతని తల్లి లక్ష్మి గృహిణి. అతని తమ్ముడు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. కిషోర్ ఇందుకూరి తన 10వ తరగతిని నలంద విద్యాలయ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసి, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కెమిస్ట్రీలో బీఎస్సీ పట్టా పొందారు. అనంతరం అతను యూఎస్ఏలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో పాలిమర్ సైన్స్‌లో తన పీహెచ్‌డీ చేశాడు. అయితే అతను డెయిరీ వ్యాపారం వైపు ఎలా వెళ్లి సక్సెస్ అయ్యాడో? తెలుసుకుందాం.
పీహెచ్‌డీ అనంతరం కిషోర్ సీనియర్ ప్రాసెసింగ్ ఇంజనీర్‌గా అరిజోనాలోని చాండ్లర్‌లో యూఎస్ ఆధారిత టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే ఉద్యోగ జీవితం తృప్తిని ఇవ్వకపోవడంతో అనేక విజయవంతం కాని వ్యాపారాలను ప్రారంభించాడు. అతను జీఆర్ఈ, టోఫెల్ కోసం ట్యూషన్ అందించాడు. అతను కూరగాయల సాగు చేసే సంస్థను కూడా పెట్టాడు. ఇలా రెండేళ్ల కాలంలో పలు వ్యాపారాల్లో కోటి రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టాడు. అయితే అతను పరిశ్రమ నిపుణుల సలహా తీసుకొని 20 ఆవులను కొనుగోలు చేసిన తర్వాత 2012లో డెయిరీ ఫామ్‌ను ప్రారంభించాడు. అయితే అందరిలా పాలు కేంద్రానికి పోయకుండా వినూత్నంగా వినియోగదారులకే అమ్మడం ప్రారంభించాడు.
వ్యాపారం పెట్టడమే కాక సక్సెస్ అవ్వడం కోసం ఆవులకు పాలు పితకడం నుంచి వాటి గడ్డి వేయడం వరకు అతను దాదాపు ప్రతి పని చేశాడు. అతను తన డెయిరీ పాలల్లో కృత్రిమ హార్మోన్లు, ప్రిజర్వేటివ్‌లు, నీరు లేనిదని ప్రచారం చేశాడు. అదనంగా, కొనుగోలు చేసే ముందు ఖాతాదారులకు వస్తువులను రుచి చూడాలని కోరేవాడు. ప్రస్తుతం కిషోర్ ఇందుకూరి హైదరాబాద్‌లో అతి పెద్ద ప్రైవేట్ పాల సరఫరాదారులలో ఒకటిగా మారాడు. ప్రస్తుతం ఆయన కంపెనీ దాదాపు 2,000 మంది పాడి రైతుల నుంచి స్వచ్ఛమైన పాలను కొనుగోలు చేసి ప్రతిరోజూ 20,000 మందికి పైగా పాలను సరఫరా చేస్తున్నారు.
సిడ్ డెయిరీ ఫామ్ తన మోడల్ ఫామ్‌లో దాదాపు 100 పశువులున్నాయి. అతను మొదట పచ్చి పాల సరఫరాతో ప్రారంభించాడు. కానీ నిరంతరం పెరుగుతున్న డిమాండ్‌ను నెరవేర్చడానికి పాలను పాశ్చరైజ్ చేయాల్సిన అవసరం ఉందని త్వరగా గ్రహించి, షహబాద్‌లో పొలాన్ని కొనుగోలు చేసి రూ.1.3 కోట్లు రుణం తీసుకుని డెయిరీ ప్రాసెసింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అతను ప్రస్తుతం చందా ఆధారిత వ్యాపార వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. 2020–2021లో కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 44 కోట్లుగా ఉంది. 2021–2022లో ఇది రూ. 64.5 కోట్లతో సక్సెస్ అయ్యాడు.
మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.