AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Spot Valuation 2024: తెలంగాణ ఇంటర్‌ ‘మూల్యాంకన’ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు నిషేధం.. ఏప్రిల్‌ ఆఖరులో ఫలితాలు!

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరిగాయి. ఇక ఇప్పటికే ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్‌ వాల్యూయేషన్‌) కూడా ప్రారంభమైంది. మూల్యాంకనం ప్రక్రియను ఇంటర్‌ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. మూల్యాంకన కేంద్రాల్లో విధులకు హాజరయ్యే అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఇంటర్ బోర్డు ఆదేశించింది..

TS Inter Spot Valuation 2024: తెలంగాణ ఇంటర్‌ ‘మూల్యాంకన’ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు నిషేధం.. ఏప్రిల్‌ ఆఖరులో ఫలితాలు!
Inter Spot Valuation
Srilakshmi C
|

Updated on: Mar 26, 2024 | 9:11 AM

Share

హైదరాబాద్‌, మార్చి 26: తెలంగాణ ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరిగాయి. ఇక ఇప్పటికే ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్‌ వాల్యూయేషన్‌) కూడా ప్రారంభమైంది. మూల్యాంకనం ప్రక్రియను ఇంటర్‌ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. మూల్యాంకన కేంద్రాల్లో విధులకు హాజరయ్యే అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఇంటర్ బోర్డు ఆదేశించింది. కేంద్రాల్లోకి గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తాయని, ఆ సమస్యలు పునరావృతంకాకుండా వెంటనే స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను సెక్యురిటీ గార్డులకు డిపాజిట్‌ చేయాలని బోర్డు సూచించింది. అలాగే పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేసే గదుల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మూల్యాంకనం చేసేందుకు సమాధాన పత్రాలు తీసుకున్నప్పటి నుంచి, తిరిగి సంబంధిత అధికారికి వాటిని ఇచ్చే వరకు హాలులోనే ఉండాలని సూచించింది. గదిని దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్‌లో నమోదు చేయాలని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్‌ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, అక్రమాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. అధ్యాపకులు పూర్తిచేసిన మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి తరలించేలా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు మూల్యాంకన కేంద్రాలకు చేరుకున్నాయి. వీటిని మూల్యాంకనం చేసేందుకు సబ్జెక్టుల వారీగా 20 వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

ఒక్కో అధ్యాపకుడు ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున.. రోజుకు కేవలం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యమైన మూల్యాంకనం లక్ష్యంగా ఈ విధానాన్ని అవలంభిస్తున్నట్లు పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. మూల్యాకనం అనంతరం పది రకాలుగా పరీక్షించిన తర్వాతే ఆ మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఒకరు పొరపడ్డా, మరో ఎగ్జామినర్‌ దాన్ని పరిశీలించి విద్యార్థి మార్కులు కోల్పోయే అవకాశం లేకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ రెండో వారానికల్లా స్పాట్‌ పూర్తి చేసి, సాంకేతిక లోపాలుంటే మూడో వారంలో సరిచేసి, నాల్గవ వారంలో ఫలితాలు వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఆలస్యమైతే మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?