Mukhtar Ansari: జైలు శిక్ష అనుభవిస్తోన్న గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి.. రాష్ట్రంలో 144 సెక్షన్‌ విధింపు

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత ముఖ్తార్‌ అన్సారీ (63) గుండెపోటుతో గురువారం సాయంత్రం (మార్చి 28) మృతి చెందారు. బండా జిల్లా జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న ముఖ్తార్‌ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం గురువారం సాయంత్రం రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన మృతి చెందారు. జైలు అధికారులు తెలిపిన..

Mukhtar Ansari: జైలు శిక్ష అనుభవిస్తోన్న గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి.. రాష్ట్రంలో 144 సెక్షన్‌ విధింపు
Mukhtar Ansari
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 29, 2024 | 7:06 AM

లక్నో, మార్చి 29: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత ముఖ్తార్‌ అన్సారీ (63) గుండెపోటుతో గురువారం సాయంత్రం (మార్చి 28) మృతి చెందారు. బండా జిల్లా జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న ముఖ్తార్‌ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం గురువారం సాయంత్రం రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన మృతి చెందారు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

ముఖ్తార్‌ అన్సారీ మంగళవారం రంజాన్‌ ఉపవాసం విరమించిన తర్వాత కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో తొలుత ఆయనను చికిత్స నిమిత్తం వైద్యులను జైలుకు పిలిపించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు హార్ట్‌అటాక్‌ వచ్చినట్లు భావించి ఆసుపత్రికి తరలించారు. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ముఖ్తార్‌ను రాత్రి 8.25 గంటలకు ఆస్పత్రికి తరలించారు. 9 మంది వైద్యులతో కూడిన ప్యానెల్‌ అతడికి చికిత్స అందించింది. సుమారు 14 గంటలపాటు ఆయన ఆస్పత్రిలో ఉన్నారు. రెండు రోజుల క్రితం తనకు విషం కలిపిన ఆహారం జైలులో పెట్టారంటూ బారాబంకి కోర్టుకు తెలిపారు. కానీ వైద్య పరీక్షల్లో అన్సారీకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందించారు. వైద్యులు ఆయనకు ఆపరేషన్‌ చేయాలని సూచించారు. అయితే ఆయన కొన్ని గంటల వ్యవధిలోనే గుండెపోటుతో మరణించారు. ముఖ్తార్ అన్సారీ మృతికి సమాజ్ వాదీ పార్టీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే శ్రీ ముఖ్తార్ అన్సారీ మృతి చెందడం విచారకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ సమాజ్‌వాదీ పార్టీ ట్వీట్‌లో నివాళులు అర్పించింది.

ముఖ్తార్ అన్సారీ మౌ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలు కేసుల్లో 2005 నుంచి యూపీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అతనిపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో 15 హత్య కేసులు . పంజాబ్ జైలులో రెండు సంవత్సరాలు గడిపాడు. ఏప్రిల్ 2021 లో అక్కడి నుంచి యూపీలోని బందా జైలుకు తరలించారు. 2022 సెప్టెంబరు నుంచి యూపీలోని వివిధ కోర్టులు అతనికి ఎనిమిది కేసులలో శిక్ష విధించాయి. దీంతో ఆయన బండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గతేడాది ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీ చేసిన 66 మంది గ్యాంగ్‌స్టర్ల జాబితాలో అతని పేరు కూడా ఉంది. మరోవైపు ముఖ్తార్‌ మృతి నేపథ్యంలో.. లక్నో, కాన్పూర్, మౌ, ఘాజీపూర్ సహా బండా తదితర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా 144 సెక్షన్‌ విధించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.

1980ల్లో గ్యాంగ్‌ సభ్యుడిగా చేరి, ఆ తర్వాత 1990ల్లో సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్‌, వారణాసి ప్రాంతాల్లో ముఖ్తార్‌ గ్యాంగ్‌ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడింది. 2004లోఆయన వద్ద మెషిన్‌ గన్‌ లభ్యం కావడంతో పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్‌తో ఆయుధాలు కలిగి ఉండటంతో ఈనెల (మార్చి) 13న కోర్టు జీవితఖైదు విధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.