Weather Report Today: భగభగమండుతున్న ఎండలు.. ఆ 7 జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ జారీ

ఏప్రిల్‌ నెల ఆరంభంకాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యదిక ఉష్టోగ్రత నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగినట్లు పేర్కొంది..

Weather Report Today: భగభగమండుతున్న ఎండలు.. ఆ 7 జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ జారీ
Weather Report
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 29, 2024 | 7:56 AM

హైదరాబాద్, మార్చి 29: ఏప్రిల్‌ నెల ఆరంభంకాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యదిక ఉష్టోగ్రత నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగినట్లు పేర్కొంది. నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌లో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత గురువారం నమోదైంది. ఆ తర్వాత స్థానల్లో అంకపూర్ 42.1, నర్సాపూర్ జి 41.9, కడెం 41.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆదిలాబాద్ జిల్లా అర్లి ( టి ) 42.3 , చాప్రాల 42.2, సాత్నాల 41.6, బేలా 41.5, ఆదిలాబాద్ (Urban) 41.4, భోరక్ 41.3, జైనథ్ 41.1, మావల 41.1, ఇంద్రవెళ్లి 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మంచిర్యాల జిల్లా కొండపూర్ 42.1, నర్సాపూర్ 40.9 భీమిని 40.7, నెన్నెల 40.3, కవ్వాల్ టైగర్ రిజర్వ్ 40.2, ఆసిపాబాద్ జిల్లా 42.5 , వంకులం 42.3, తిర్యాణీ 41.5, కెరమెరి 41.4 , సిర్పూర్ ( టి ) 40.9, కాగజ్ నగర్ 40.9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ లోని నాలుగు జిల్లాలతో సహా మరో 3 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఏపీలో ఎంత తీవ్రతతోపాటు వడగాల్పులు కూడా..

ఇవి కూడా చదవండి

అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కూడా మొదలయ్యాయి. శుక్రవారం 42 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వైయస్సార్ కడప 18, నంద్యాల 8, పార్వతీపురంమన్యం 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 1, పల్నాడు ఒక్క మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శనివారం 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.