AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCS Recruitment: నిరుద్యోగులకు టీసీఎస్ కంపెనీ శుభవార్త.. ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

హైరింగ్ స్తంభన కారణంగా ప్రభావితమైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది పెద్ద ఉపశమనమని నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్లయ్ చేసుకున్న వారికి ఏప్రిల్ 26న పరీక్షలను నిర్వహిస్తుంది. టీసీఎస్ వెబ్‌సైట్ కెరీర్ పేజీ ప్రకారం కంపెనీ బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్ గ్రాడ్యూయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

TCS Recruitment: నిరుద్యోగులకు టీసీఎస్ కంపెనీ శుభవార్త.. ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Tcs
Nikhil
|

Updated on: Mar 30, 2024 | 4:45 PM

Share

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎష్) ఫ్రెషర్‌లను నియమించుకోవడం ప్రారంభించింది. కంపెనీలో ఉద్యోగాల కోసం ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులను ఆహ్వానింస్తుంది. హైరింగ్ స్తంభన కారణంగా ప్రభావితమైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది పెద్ద ఉపశమనమని నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్లయ్ చేసుకున్న వారికి ఏప్రిల్ 26న పరీక్షలను నిర్వహిస్తుంది. టీసీఎస్ వెబ్‌సైట్ కెరీర్ పేజీ ప్రకారం కంపెనీ బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్ గ్రాడ్యూయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో టీసీఎస్ నింజా, డిజిటల్, ప్రైమ్ అనే మూడు కేటగిరీల కోసం నియామకం చేస్తోంది. టీసీఎస్ నియామకాల కోసం మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టీసీఎస్ నింజా టీమ్ వివిధ పాత్రల కోసం సంవత్సరానికి రూ. 3.36 లక్షల ప్యాకేజీని అందిస్తుంది. అలాగే డిజిటల్, ప్రైమ్ కేటగిరీలు సంవత్సరానికి వరుసగా రూ. 7 లక్షలు, రూ. 9-11.5 లక్షలు అందిస్తున్నాయి. అయితే ఖాళీల సంఖ్యను టీసీఎస్ వెల్లడించలేదు. ఈ నియామకాలు డిసెంబర్ 2023 ఆదాయాల కాల్‌లో మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన వ్యాఖ్యానానికి అనుగుణంగా ఉన్నాయి. తాము ఇప్పటికే వచ్చే సంవత్సరానికి మా క్యాంపస్ నియామక ప్రక్రియను ప్రారంభించామన, టీసీఎస్‌లో చేరడానికి ఫ్రెషర్‌లలో విపరీతమైన ఉత్సాహాన్ని చూస్తున్నామని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. అయితే నియామకాల సంఖ్యను పేర్కొనడం చాలా కష్టమని, అయినప్పటికీ అది పెద్ద సంఖ్యలో ఉంటుందని లక్కడ్ పేర్కొన్నారు. ఎఫ్‌వై 2023-24 కోసం టీసీఎస్ 40,000 మంది ఫ్రెషర్లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇటీవల అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) జనరేటివ్ ఏఐ (జెన్ఏఐ) యోగ్యతను ప్రయోగ భాగస్వామిగా సాధించినట్లు తెలిపింది. జెన్ఏఐలో పునాది నైపుణ్యాలపై శిక్షణ పొందిన 350,000 మంది ఉద్యోగులతో టీసీఎస్ ప్రపంచంలోని అతిపెద్ద ఏఐ- సిద్ధంగా ఉన్న వర్క్‌ఫోర్స్‌లలో ఒకదానిని నిర్మించడానికి సిద్ధంగా ఉంది. ఏడబ్ల్యూఎస్ నుంచి వచ్చిన ఈ మొదటి రకం స్పెషలైజేషన్ ఏఐ డొమైన్‌లోని కస్టమర్‌లకు ప్రముఖ పరివర్తన భాగస్వామిగా టీసీఎష్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం టీసీఎస్ అధికారిక పోర్టల్ ద్వారా లాగిన్ అవ్వాలి. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం రిజిస్టర్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.  

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..