RCB Vs KKR, IPL 2024: కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కన్నేసిన కోహ్లీ
Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders : IPL 2024లో RCB తన మూడో మ్యాచ్ శుక్రవారం (మార్చి 29) ఆడనుంది. చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆ జట్టు తలపడనుంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా హై ఓల్టేజ్ మ్యాచ్‌లో సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ
Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders : IPL 2024లో RCB తన మూడో మ్యాచ్ శుక్రవారం (మార్చి 29) ఆడనుంది. చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆ జట్టు తలపడనుంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా హై ఓల్టేజ్ మ్యాచ్‌లో సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కీలక పాత్ర పోషించననున్నాడు. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో కోహ్లీకి చరిత్ర సృష్టించే అవకాశం లభించనుంది. RCB తరఫున మొత్తం 239 IPL మ్యాచ్‌లలో 237 సిక్సర్లు కొట్లాడు 35 ఏళ్ల విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఇదే బెంగళూరు తరఫున క్రిస్ గేల్ 239 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టడానికి, అలా చేసిన మొదటి క్రికెటర్‌గా అవతరించడానికి కోహ్లీకి కేవలం మూడు సిక్సర్లు అవసరం. RCB తరఫున 85 IPL మ్యాచ్‌ల్లో గేల్ 239 సిక్సర్లు బాదాడు. అలాగే AB డివిలియర్స్ 156 IPL మ్యాచ్‌లలో 238 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లి సరికొత్త రికార్డును లిఖించే అవకాశం ఉంది. ఇప్పటివరకు, గేల్, డివిలియర్స్, కోహ్లి, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ మరియు MS ధోనీ మాత్రమే ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే IPLలో ఒక జట్టు కోసం 200 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టగలిగారు.
ఇక కోల్ కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. లెజెండరీ వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ కనీసం మూడు సిక్సర్లు బాదగలిగితే ఎలైట్ జాబితాలో చేరే అవకాశం ఉంది. అతను KKR ఫ్రాంచైజీ తరఫున 106 IPL మ్యాచ్‌లలో 197 సిక్సర్లను బాదాడు. సిక్సర్ల రికార్డుతో పాటు కేకేఆర్ తరఫున ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేసే అవకాశం కూడా రస్సెల్‌కు ఉంది.
The knights are in town, and at our gates. We’re ready to defend our home! 🏰 👊
Watch #RCBvKKR live on @JioCinema #PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/Ix7QYHYhmt
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 29, 2024
RCB ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయేష్ ప్రభుదేశాయ్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, లక్కీ ఫెర్గూసన్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్
This is giving 2016 🤌
Friends, captains and most importantly Royal Challengers! So good to see you, Watto. 🤩#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 @ShaneRWatson33 @imVkohli pic.twitter.com/RFuvAP8YIe
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 29, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..