IPL 2024: హార్దిక్‌కు ఉద్వాసన! రోహిత్‌ను కాదని ముంబై కెప్టెన్‌గా తెరపైకి కొత్త పేరు! ఎవరంటే?

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ కు ఈ సీజన్ లో ఏదీ కలిసి రావడం లేదు. ఓ వైపు వరుస ఓటములు, మరోవైపు కెప్టెన్సీ సమస్యలు ఆ జట్టు ఆటతీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.

IPL 2024: హార్దిక్‌కు ఉద్వాసన! రోహిత్‌ను కాదని ముంబై కెప్టెన్‌గా తెరపైకి కొత్త పేరు! ఎవరంటే?
Mumbai Indians
Follow us

|

Updated on: Mar 29, 2024 | 6:40 PM

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ కు ఈ సీజన్ లో ఏదీ కలిసి రావడం లేదు. ఓ వైపు వరుస ఓటములు, మరోవైపు కెప్టెన్సీ సమస్యలు ఆ జట్టు ఆటతీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఆ మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక బాదుతూ ఎస్ఆర్‌హెచ్ ఏకంగా 277 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు ఇదే. జస్‌ ప్రీత్ బుమ్రా, కోయెట్జీ, పీయుష్ చావ్లా, హార్దిక్ వంటి స్టార్ బౌలర్ల ఉన్న ముంబై ఇలాంటి చెత్త రికార్డును మూటగట్టుకోవడం ఆ జట్టు ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపర్చింది. అదే సమయంలో కెప్టెన్ గా హార్దిక్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను ముంబై ఓటమికి కారణంగా చూపిస్తున్నారు. బుమ్రా వంటి స్టార్ బౌలర్ ను కాదని హార్దిక్ మొదటి ఓవర్ లో బంతి తీసుకోవడం సరికాదంటూ మాజీ క్రికెటర్లు మండి పడుతున్నారు. దీంతో పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. మళ్లీ రోహిత్ శర్మకే పగ్గాలు అప్పజెప్పాలంటూ విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.

మరోవైపు వరుస ఓటముల కారణంగా హార్దిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కూడా గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కెప్టెన్సీ విషయంలో పునరాలోచిస్తున్నట్లు సమాచారం. పాండ్యా స్థానంలో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాకు ముంబై సారత్య బాధ్యతలు కట్ట బెట్టే యోచనలో ఫ్రాంఛైజీ యాజమాన్యం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి రాబోయే రోజుల్లో ముంబై ఇండియన్స్ టీమ్ లో ఎలంటి మార్పలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. కాగా తదుపరి మ్యాచ్ లో ఏప్రిల్ 1న వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 11న స్వదేశంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనూ, ఏప్రిల్ 14న వాంఖడేలో పంజాబ్ కింగ్స్‌తోనూ తలపడనుంది. అంటే ఆ జట్టు తమ సొంత మైదానంలో వరుసగా 4 మ్యాచ్‌లు ఆడనుంది.

ఇవి కూడా చదవండి

సొంత గడ్డకు చేరుకున్న ముంబై ఆటగాళ్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..