RCB vs KKR, Playing XI, IPL 2024: కోల్‌కతాతో మ్యాచ్.. టాస్ ఓడిన బెంగళూరు..ప్లేయింగ్-XI ఇదే
Sunrisers Hyderabad Vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా మరికాసేపట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హైవోల్టేజీ పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది
Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా మరికాసేపట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హైవోల్టేజీ పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్నిమెరుగుపర్చుకోవాలని ఇరు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి. లీగ్‌లో ఆర్‌సీబీకి ఇది మూడో మ్యాచ్ కాగా, కేకేఆర్‌కు ఇది రెండో మ్యాచ్. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుండడంతో హోరాహోరీ పోరు తప్పదంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. గత రికార్డులను పరిశీలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ దే పైచేయిగా కనిపిస్తోంది . ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 18 మ్యాచ్‌లు గెలివగా, 14 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గెలిచింది. గత 5 సంవత్సరాల్లో, RCB మరియు KKR 10 సార్లు తలపడగా, ఇందులో రెండు జట్లు చెరో 5 మ్యాచ్‌లు గెలిచాయి.
ఈ మ్యాచ్ లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
కోహ్లీ వర్సెస్ స్టార్క్..
Some fun and laughter 😄 Some pre match catch ups 🤗
Edging Closer ◾️◾️◾️▫️▫️
Follow the Match ▶️ https://t.co/CJLmcs7ICI #TATAIPL | #RCBvKKR pic.twitter.com/rgLfR7jKAK
— IndianPremierLeague (@IPL) March 29, 2024
కోల్ కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ -XI)
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రమణదీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
మ్యాచ్ కు ముందు కేకేఆర్, ఆర్సీబీ ఆటగాళ్లు..
Folks, Buckle 🆙, it’s time for match 🔟 🙌
⏰ 7:30 PM IST 💻 https://t.co/4n69KTTxCB 📱 Official IPL App#TATAIPL | #RCBvKKR | @RCBTweets | @KKRiders pic.twitter.com/xDD6XoUPVD
— IndianPremierLeague (@IPL) March 29, 2024
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ -XI)
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కెమెరూన్ గ్రీన్, రజత్ పాటిల్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..