KV Admission: పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌..

ఒక్కసారి ప్రవేశం లభిస్తే 11వ తరగతి వరకు బిందాస్‌గా ఉండడంతో ఇందుకోసం పోటీ తీవ్రంగా నెలకొంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 15 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు...

KV Admission: పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌..
Kv Admission
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 29, 2024 | 12:19 PM

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయాల్లో తమ పిల్లలకు సీటు రావడానికి పేరెంట్స్‌ ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. నామ మాత్రపు ఫీజుతో మంచి నాణ్యమైన విద్య, సీబీఎస్‌ఈ ఎడ్యుకేషన్‌ అందుతుండడంతో చాలా మంది ఈ దిశగా ఆలోచనలు చేస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ న్యూస్‌. 2024-25 ఏడాదికి గాను ఒకటో తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేశారు. అధకారులు.

ఒక్కసారి ప్రవేశం లభిస్తే 11వ తరగతి వరకు బిందాస్‌గా ఉండడంతో ఇందుకోసం పోటీ తీవ్రంగా నెలకొంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 15 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే చిన్నారుల వయసు మార్చి 31 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి వారి వారి ప్రయారిటీ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. వీటిలో మొదటగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికులు ఇలా ప్రయారిటీలను నిర్ణయిస్తారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్‌ లిస్ట్‌ను ఏప్రిల్‌ 19న విడుదల చేస్తారు.

మొదటి లిస్ట్‌ ఆధారంగా మిగిలిన ఖాళీలను బట్టి రెండో ప్రొవిజినల్‌ జాబితాను ఏప్రిల్‌ 29న, మూడో ప్రొవిజినల్‌ జాబితాను మే 8న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే రెండో తరగతితో పాటు ఆపై తరగతుల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు సయాన్ని ఇచ్చారు. అయితే ఇందులో 11వ తరగతికి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!