- Telugu News Photo Gallery How incomplete sleep harms body, staying awake late at night can create problem for your kidneys
రాత్రిపూట నిద్రపోవడం లేదా..? మీ కిడ్నీలు పాడవుతాయట.. మున్ముందు ఇక కష్టమే..
నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అర్థరాత్రి వరకు పని చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా పార్టీలు చేసుకోవడం, ఒత్తిడి, పలు ఇబ్బందులు.. ఇవన్నీ నిద్రలేమికి కారణమవుతాయి. అయితే రాత్రి పూట మేల్కొని ఉండడం వల్ల మీ కిడ్నీలు కూడా పాడవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Updated on: Apr 02, 2024 | 1:31 PM

నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అర్థరాత్రి వరకు పని చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా పార్టీలు చేసుకోవడం, ఒత్తిడి, పలు ఇబ్బందులు.. ఇవన్నీ నిద్రలేమికి కారణమవుతాయి. అయితే రాత్రి పూట మేల్కొని ఉండడం వల్ల మీ కిడ్నీలు కూడా పాడవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేకపోవడం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం నిద్రపోతున్నప్పుడు, మూత్రపిండాలు వాటంతటవే రిపేర్ చేసుకుంటాయి.. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి. కానీ మనం తక్కువ నిద్రపోతున్నప్పుడు, కిడ్నీలకు ఈ పని చేయడానికి తగినంత సమయం లభించదు. అసంపూర్ణ నిద్ర మూత్రపిండాలకు హాని కలిగించడంతోపాటు.. పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.. అవేంటో తెలుసుకోండి..

రక్తపోటు పెరుగుదల: మీకు తగినంత నిద్ర లేనప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. దీంతో మూత్రపిండాలు దెబ్బతింటాయి.

ఇన్ఫ్లమేషన్ పెరుగుదల: నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో మంట పెరుగుతుంది.. ఇది కిడ్నీ దెబ్బతినే కారకాల్లో ఒకటి.

మీరు తిన్న వెంటనే నిద్రపోతే వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది జీర్ణక్రియలో సమస్యలు. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల వివిధ రకాల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందట.

రక్తప్రసరణలో తగ్గుదల: నిద్ర లేకపోవడం వల్ల కిడ్నీలో రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది మూత్రపిండాల పనితీరు క్షీణించడానికి దారితీస్తుంది.

తిన్న తర్వాత నేరుగా బెడ్‌పై నిద్రపోయే అలవాటు ఆరోగ్యానికి తీవ్ర హాని తలపెడుతుంది. ఇప్పటికే ఈ అలవాటు చాలా కాలంగా అనుసరిస్తున్నవారు వెంటనే మానుకోవాలి. ఓన్లీ మై హెల్త్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మంచిగా నిద్ర పోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి.




