- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: LSG key Bowler Mayank Yadav Bowls A Searing 155.8 Kmph Speed
IPL 2024: ఏందిరయ్యా ఈ బౌలింగ్.. తొలి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ బాల్.. బ్యాటర్లకే దడ పుట్టిస్తున్నావ్..
Mayank Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 11వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు 178 పరుగులకే ఆలౌటైంది. దీంతో లక్నో సూపర్ జెయింట్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Updated on: Mar 31, 2024 | 12:05 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ రికార్డును 21 ఏళ్ల యువ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ సృష్టించాడు. లక్నో సూపర్‌జెయింట్స్ తరపున అరంగేట్రం చేసిన మయాంక్.. IPL 2024లో తొలి మ్యాచ్‌లోనే అత్యంత వేగంగా బంతిని బౌలింగ్ చేసి రికార్డు సృష్టించాడు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మైదానంలోకి వచ్చిన మయాంక్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 149 కిలోమీటర్ల వేగంతో తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన యువ స్పీడ్‌స్టర్‌ను ఎదుర్కోవడానికి పంజాబ్ కింగ్స్ అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్ చాలా కష్టపడ్డారు.

ముఖ్యంగా మయాంక్ యాదవ్ వేసిన 12వ ఓవర్ తొలి బంతి శిఖర్ ధావన్ రెప్పపాటు వ్యవధిలో వికెట్ కీపర్ చేతిలో పడింది. ఈ డెలివరీ గంటకు 155.8 కి.మీ వేగంతో ఉండటం విశేషం. దీంతో మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.

ఇంతకుముందు ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాండ్రే బెర్గర్ పేరిట ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెర్గర్ గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పుడు 21 ఏళ్ల మయాంక్ యాదవ్ 145 నుంచి 150 వరకు నిలకడగా బౌలింగ్ చేసి సంచలనం సృష్టించాడు. అంతేకాకుండా ఈసారి ఐపీఎల్‌లో 155.8 కిలోమీటర్ల వేగంతో ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన మయాంక్ 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ టైట్ నిలిచాడు. 2011లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన టైట్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 157.71 కిలోమీటర్ల వేగంతో రికార్డు సృష్టించాడు. మరి ఈ రికార్డును మయాంక్ యాదవ్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.




