- Telugu News Sports News Cricket news IPL 2024: Virat Kohli Shares His Bat And Hug to Rinku Singh after rcb vs kkr match
IPL 2024: రింకూ సింగ్‌కి మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
IPL 2024, Virat Kohli - Rinku Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17లో, RCB జట్టు ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో CSKపై ఓడిపోయిన RCB రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ మళ్లీ ఓడిపోయి నిరాశపరిచింది.
Updated on: Mar 31, 2024 | 11:12 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 10వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం తర్వాత, KKR బ్యాటర్ రింకూ సింగ్ RCB జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించాడు.

విరాట్ కోహ్లిని కలిసేందుకు వచ్చిన రింకూ సింగ్.. కాసేపు సందడి చేశాడు. కింగ్ కోహ్లి నుంచి బ్యాటింగ్ చిట్కాలు కూడా అందుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లి ఈ యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కి ప్రత్యేక బహుమతి ఇచ్చాడు.

రింకూ సింగ్‌కి విరాట్ కోహ్లీ తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. కింగ్ కోహ్లి నాణ్యమైన బ్యాట్‌ని ఉపయోగిస్తాడు. కింగ్ కోహ్లీ నుంచి చాలా మంది ఆటగాళ్లు బ్యాట్ అడుగుడుతుంటారు. ఇప్పుడు, కింగ్ కోహ్లీ తన బ్యాట్‌ను రింకూ సింగ్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఈ ఫొటోలను KKR ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

RCB డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయలుదేరే ముందు రింకు సింగ్ కూడా విరాట్ కోహ్లీ నుంచి లక్కీ హగ్ అందుకున్నాడు. ఇప్పుడు రింకూ-కోహ్లీల బంధానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌ని లక్నో సూపర్‌జెయింట్‌తో ఆడనుంది. ఏప్రిల్ 2వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ద్వారా ఆర్‌సీబీ జట్టు విజయాల బాట పట్టేందుకు సమాయత్తమవుతోంది.




