- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Why Delhi Capitals Playing In Vizag vs CSK Match?
DC vs CSK, IPL 2024: ‘వైజాగ్’ ఢిల్లీదే అయినా.. చెన్నై జట్టుకే మద్దతు.. అసలు కారణం ఇదే..
Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 11వ మ్యాచ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరగనుంది. ఆదివారం (మార్చి 31) జరిగే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడడం విశేషం. అంటే ఈ గ్రౌండ్ రెండు జట్లకు హోమ్ గ్రౌండ్ కాదు. అయితే, ఢిల్లీతో పోల్చితే చెన్నై జట్టుకే అభిమానుల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది.
Updated on: Mar 31, 2024 | 10:56 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ గ్రౌండ్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని విఖాపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

అంటే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ హోమ్ గ్రౌండ్‌గా వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంను ఎంచుకుంది. దీని ప్రకారం రిషబ్ పంత్ జట్టు ఈ మైదానంలో సీఎస్‌కే, కేకేఆర్‌లతో 2 మ్యాచ్‌లు ఆడనుంది.

మ్యాచ్ షిఫ్ట్ ఎందుకు?: ఈ మ్యాచ్ లు ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే, తాజాగా అదే మైదానంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. నాకౌట్ మ్యాచ్‌లతో సహా మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్స్‌కు స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది.

ఐపీఎల్ మ్యాచ్‌లకు స్టేడియం పూర్తిగా సిద్ధంగా లేదు. అందువల్ల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రత్యామ్నాయ మైదానాన్ని ఎంచుకోవాలని బీసీసీఐ సూచించింది. తదనుగుణంగా పుణె, విశాఖపట్నం, కటక్ మైదానాల్లో ఆప్షన్‌లు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు దక్షిణ భారత స్టేడియంను ఎంచుకుంది.

దీని ప్రకారం రిషబ్ పంత్ జట్టు విఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో 2 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ని ఏప్రిల్ 20న ఢిల్లీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ దక్షిణ భారత మైదానాన్ని తమ సొంత మైదానంగా ఎంచుకోవడం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే CSK జట్టుకు సౌత్ ఇండియాలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ధోనికి ఆంధ్రాలో అభిమానులు ఉన్నారు.

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సీఎస్‌కే అభిమానులు స్టేడియంలో సందడి చేసే అవకాశం ఉంది. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానుల మద్దతుతో వారి సొంత మైదానంలో ఆడిన అనుభవాన్ని పొందుతుంది.




