- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Punjab Kings Captain Skipper Shikhar Dhawan Breaks Virat Kohli's Record
IPL 2024: కింగ్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన శిఖర్ ధావన్.. అదేంటంటే?
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు 178 పరుగులకే ఆలౌటైంది. దీంతో లక్నో సూపర్ జెయింట్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Updated on: Mar 31, 2024 | 5:40 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 11వ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఆకట్టుకునే హాఫ్ సెంచరీ సాధించి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ధావన్ 50 బంతుల్లో 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 70 పరుగులు చేశాడు.

ఈ హాఫ్ సెంచరీతో శిఖర్ ధావన్ ఐపీఎల్ చరిత్రలో ఛేజింగ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు కింగ్ కోహ్లీ పేరిట ఉండేది.

ఐపీఎల్‌లో 232 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తం 52 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ అర్ధసెంచరీల్లో 21 ఛేజింగ్‌లోనే రావడం విశేషం. దీంతో ఐపీఎల్ రన్ ఛేజింగ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టడంలో శిఖర్ ధావన్ సక్సెస్ అయ్యాడు. ఐపీఎల్‌లో 219 మ్యాచ్‌లు ఆడిన ధావన్ మొత్తం 51 అర్ధ సెంచరీలు చేశాడు. కాగా, ఛేజింగ్‌లో శిఖర్ బ్యాట్‌తో మొత్తం 22 అర్ధశతకాలు సాధించాడు. దీంతో కోహ్లి పేరిట ఉన్న ఛేజింగ్ హాఫ్ సెంచరీ రికార్డును శిఖర్ ధావన్ చేజిక్కించుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో, ఛేజింగ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. ఐపీఎల్‌లో 178 ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్ 61 అర్ధశతకాలు సాధించాడు. ఈ అర్ధసెంచరీల్లో 34 ఛేజింగ్‌లో చేసినవే కావడం విశేషం.




