Dina Boluarte: లగ్జరీ వాచ్‌ తెచ్చిన తంటా.. అధ్యక్షురాలి ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు

ఖరీదైన వాచీ ధరించి పీకల్లోతు చిక్కుల్లో పాతుకుపోయారు పెరూ దేశ అధ్యక్షురాలు డైనా బులురెటే. ఆమె లగ్జరీ వాచ్‌లలో ఒకటిగా పేరుగాంచిన రోలెక్స్‌ వాచీ చేతికి ధరించి కనిపించారు. పైగా ఆమె వద్ద దాదాపు పదికిపైగా లగ్జరీ వాచ్‌లు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీనితో దేశ అధ్యక్షురాలిగా ఎన్నికైన సమయంలో ప్రజా రికార్డుల్లో ఖరీదైన రోలెక్స్‌ వాచీని చూపెట్టలేదని, కానీ ఆమె ప్రస్తుతం తన చేతికి రోలెక్స్‌ వాచీ పెట్టుకుని పెట్టుకుంటున్నారంటూ..

Dina Boluarte: లగ్జరీ వాచ్‌ తెచ్చిన తంటా.. అధ్యక్షురాలి ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు
Dina Boluarte
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 31, 2024 | 7:01 AM

లిమా, మార్చి 31: ఖరీదైన వాచీ ధరించి పీకల్లోతు చిక్కుల్లో పాతుకుపోయారు పెరూ దేశ అధ్యక్షురాలు డైనా బులురెటే. ఆమె లగ్జరీ వాచ్‌లలో ఒకటిగా పేరుగాంచిన రోలెక్స్‌ వాచీ చేతికి ధరించి కనిపించారు. పైగా ఆమె వద్ద దాదాపు పదికిపైగా లగ్జరీ వాచ్‌లు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీనితో దేశ అధ్యక్షురాలిగా ఎన్నికైన సమయంలో ప్రజా రికార్డుల్లో ఖరీదైన రోలెక్స్‌ వాచీని చూపెట్టలేదని, కానీ ఆమె ప్రస్తుతం తన చేతికి రోలెక్స్‌ వాచీ పెట్టుకుని పెట్టుకుంటున్నారంటూ అ దేశ స్థానిక పత్రికలు కోడై కూశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆ దేశ అవినీతి నిరోధక శాఖ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు లిమాలోని అమె అధికారిక నివాసంలో శనివారం (మార్చి 30) దాడులు నిర్వహించారు. అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత డైనా అవినీతికి పాల్పడారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, సోదాలు జరుగుతున్న సమయంలో డైనా తన నివాసంలో లేకపోవడం విశేషం. శనివారం ఉదయం అధ్యక్షురాలి ఇంటిలో నిర్వహించిన సోదాలను అక్కడి టెలివిజన్‌ ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. అయితే సోదాల్లో ఖరీదైన వాచ్‌లు దొరికాయో.. లేదో మాత్రం వెల్లడించలేదు. అత్యున్నత న్యాయస్థానం నియమించిన 20 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ అధికారులు, 20 మంది పోలీస్‌ అధికారుల సమక్షంలో శుక్రవారం రాత్రి బోలువార్టే ఇంటిపై, శనివారం ఉదయం ప్యాలెస్‌పై దాడులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా డైనా డిసెంబర్‌ 2022లో అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి, డీనా అధ్యక్షపగ్గాలు చేపట్టారు. దీంతొ డూరా పెరూ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా పేరుగాంచారు. అయితే ఆ దేశ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షురాలు అవినీతికి పాల్పడినట్లు రుజువైతే పదవీ కాలం ముగిసే వరకు చర్యలు తీసుకునే అధికారం అధికారులకు లేదు. ఆమె పదవీకాలం జులై 2026 వరకు ఉంటుంది. అయితే రెండు వారాల క్రితం పెరూ అధ్యక్షురాలు డైనా వద్ద అనేక రోలెక్స్ వాచీలు ఉన్నాయని ‘ఇంటర్నెట్ ప్రోగ్రామ్ లా-ఎన్‌సెరోనా’ అనే మీడియా సంస్థలో ప్రచురించిన కథనాల మేరకు ప్రాసిక్యూటర్లు ప్రాథమిక విచారణను ప్రారంభించారు. అధ్యక్షురాలి అధికారిక విచారణకు ఆధారాలు ఉన్నాయో లేదో నిర్ధారించడానికి విచారణ చేపట్టారు. డిసెంబర్ 2022 నుంచి బోలువార్టే, రోలెక్స్ వాచీలు తన వద్ద ఉన్నాయని డైనా పేర్కొన్నారు.

తాజా దాడులపై అధ్యక్షరాలు డైనా స్పందించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కొట్టిపారేశారు. ఆ దేశ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది అసమానమైన చర్య. నేను స్వచ్ఛమైన చేతులతో అధికారం చేపట్టాను. మకిలీ అంటకుండా 2026లో పదవీ విరమన చేస్తా. ఆ వాచ్‌ ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసింది కాదు. 18 ఏళ్ల వయసు నుంచి సంపాదించిన సొమ్ముతో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశా’ అని వివరించారు. ఇక డైనాపై వచ్చిన ఆరోపణలను పెరువియన్ ప్రధాని గుస్తావో అడ్రియన్జెన్ కూడా విమర్శించారు. గత కొన్ని గంటల వ్యవధిలోనే రాజ్యంగ విరుద్ధమైన పనులకు ఉపక్రమించారంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే