అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత వరుస సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఆకట్టుకుంటుంది.