Tillu Square: టిల్లు స్క్వేర్‌కు వచ్చిన బెస్ట్ కంప్లిమెంట్ ఏంటంటే.. హీరో, ప్రొడ్యుసర్ మాటల్లోనే..
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అన్ని చోట్ల హౌజ్ ఫుల్ కలెక్షన్లతో రచ్చ చేస్తున్నాడు టిల్లు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..
Updated on: Mar 31, 2024 | 5:27 PM

టిల్లు డీజే మోత మోగుతోంది. రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ ముందు వసూళ్ల సునామీ కురిపిస్తోంది. విడుదలైన అన్ని చోట్ల హౌజ్ ఫుల్ కలెక్షన్లతో సినిమా రచ్చ చేస్తోంది. ఓవర్‌సీస్‌లోనూ భారీ కలెక్షన్లు కురిపిస్తోంది.

తొలి రోజు ఈ సినిమా ఏకంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక రెండు రోజులకు రూ. 45.3 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కచ్చితంగా రూ. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

రోజురోజుకీ కలెక్షన్ల ట్రెండ్ చూస్తుంటే డీజే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధూ, నిర్మాత నాగవంశీ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

టిల్లు స్క్వేర్ మూవీకి వచ్చిన బెస్ట్ కంప్లిమెంట్ ఏంటన్న ప్రశ్నకు బదులిచ్చిన నాగవంశీ.. సినిమా విడుదల కాగానే ఓ జర్నలిస్ట్ తనకు కాల్ చేసి, ఇప్పటి వరకు వచ్చిన సీక్వెల్ మూవీలో ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ బాగుండడం ఇదే తొలిసారి అని తెలిపారని, మూవీకి సంబంధించిన వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇదేనంటూ నాగవంశీ తెలిపారు.

ఇక హీరో సిద్ధూ మాట్లాడుతూ.. చాలా రివ్యూస్‌లో కూడా మొదటి పార్ట్ కంటే సీక్వెల్ మూవీ బాగుండడం చాలా అరుదగా జరిగింది. అందులో టిల్లు స్క్వేర్ ఒకటి అంటూ పేర్కొన్న విషయాన్ని సిద్ధు చెప్పుకొచ్చాడు. మొత్తం మీద డీజే టిల్లు కలెక్షన్లు చూస్తుంటే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది




