- Telugu News Photo Gallery Cinema photos Siddu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Box Office Collections Up To Now Telugu Heroes Photos
Tillu Square: ఊహించినట్టే టిల్లు గాడి దెబ్బకు బాక్సాఫీస్ బద్దలైపోయిందిగా..!
టిల్లు స్క్వేర్ అదిరిపోయింది.. సీక్వెల్ అంటే ఇలా ఉండాలి.. ముందు భాగం కంటే బాగా నవ్వించారు.. ఇదిగో ఇలా ఉన్నాయిప్పుడు టిల్లు స్క్వేర్‌పై కామెంట్స్. మరి ఈ సినిమాకు కలెక్షన్లు ఎలా ఉన్నాయి..? స్టార్ బాయ్ అనే ట్యాగ్ తగిలించుకున్న సిద్ధూ జొన్నలగడ్డ నిజంగానే మ్యాజిక్ చేసారా..? టిల్లు వీకెండ్ ఎలా ఉండబోతుంది..? ముందు నుంచి ఊహించిందే.. టిల్లు గాడి దెబ్బకు బాక్సాఫీస్ బద్దలైపోయింది.
Updated on: Mar 31, 2024 | 6:11 PM

టిల్లు స్క్వేర్ అదిరిపోయింది.. సీక్వెల్ అంటే ఇలా ఉండాలి.. ముందు భాగం కంటే బాగా నవ్వించారు.. ఇదిగో ఇలా ఉన్నాయిప్పుడు టిల్లు స్క్వేర్‌పై కామెంట్స్. మరి ఈ సినిమాకు కలెక్షన్లు ఎలా ఉన్నాయి..?

స్టార్ బాయ్ అనే ట్యాగ్ తగిలించుకున్న సిద్ధూ జొన్నలగడ్డ నిజంగానే మ్యాజిక్ చేసారా..? టిల్లు వీకెండ్ ఎలా ఉండబోతుంది..? ముందు నుంచి ఊహించిందే.. టిల్లు గాడి దెబ్బకు బాక్సాఫీస్ బద్దలైపోయింది.

నిర్మాత నాగవంశీ చెప్పిందే నిజమైంది.. కొడితే గుంటూరు కారం తర్వాత హైయ్యస్ట్ ఓపెనింగ్ వచ్చి టిల్లు భాయ్ ఖాతాలో పడిపోయింది. 2024లో హైయ్యస్ట్ ఓపెనింగ్ డే లిస్టులో గుంటూరు కారం 90 కోట్లతో మొదటి స్థానంలో నిలిస్తే.. 24 కోట్లతో టిల్లు స్క్వేర్ సెకండ్ ప్లేస్‌లో ఉంది.

డిజే టిల్లు ట్రెండ్ సెట్ చేయడంతో.. టిల్లు స్క్వేర్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎక్స్‌పెక్టేషన్స్ ఎన్ని పెరిగినా.. అన్నింటినీ ఈజీగానే అందుకున్నారు సిద్ధూ జొన్నలగడ్డ అండ్ టీం.

తొలిరోజే AP, తెలంగాణాలో 15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన టిల్లు స్క్వేర్.. ఓవర్సీస్‌లోనూ అద్భుతాలు చేస్తుంది. రెండో రోజుకే 1 మిలియన్ దాటేసిందక్కడ.

వీకెండ్ ముగిసేనాటికి ఓవర్సీస్‌లో 2.5 మిలియన్ క్లబ్‌లో చేరేలా కనిపిస్తుంది టిల్లు స్క్వేర్. ఫుల్ రన్‌లో చాలా రికార్డులు కొల్లగొట్టడం ఖాయమైపోయింది.

టిల్లు కారెక్టరైజేషన్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడం.. అనుపమ పాత్ర ట్రెండీగా సెట్ అవ్వడం టిల్లు స్క్వేర్‌కు కలిసొచ్చాయి. ఎలా చూసుకున్నా.. నాగవంశీ చెప్పినట్లు 100 కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు టిల్లు భాయ్.




