- Telugu News Photo Gallery Cinema photos Ranbir Kapoor, Alia Bhatt’s Rs 250 Crore New Bungalow To Be In Daughter Raha Kapoor’s Name
Ranbir- Alia Bhatt: బాలీవుడ్‌లోనే రిచెస్ట్ హౌస్‌గా రణ్‌బీర్- అలియా బంగ్లా.. ఎన్ని కోట్లతో కట్టించారంటే?
బాలీవుడ్ లో ది మోస్ట్ క్యూట్ కపుల్ అంటే ఠక్కున గుర్తకు వచ్చే పేరు రణబీర్ కపూర్, అలియా భట్. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇటీవలే ఒక అందమైన పాప పుట్టింది. ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉన్న రణ్ బీర్ దంపతులు ఇప్పుడు సొంతింటి నిర్మాణంలో బిజీగా ఉన్నారు.
Updated on: Mar 31, 2024 | 6:32 PM

బాలీవుడ్ లో ది మోస్ట్ క్యూట్ కపుల్ అంటే ఠక్కున గుర్తకు వచ్చే పేరు రణబీర్ కపూర్, అలియా భట్. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇటీవలే ఒక అందమైన పాప పుట్టింది. ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉన్న రణ్ బీర్ దంపతులు ఇప్పుడు సొంతింటి నిర్మాణంలో బిజీగా ఉన్నారు.

ముంబైలోని బాంద్రాలో అలియా భట్, రణబీర్ కపూర్ ఐషారామి హౌస్‌ని నిర్మిస్తున్నారు. ఈ కొత్తింటి కోసం సుమారు రూ. 250 కోట్లు ఖర్చు పెట్టినట్లు టాక్.

షారుఖ్ ఖాన్ పాపులర్ హౌస్ మన్నత్, అమితాబ్ బచ్చన్ ఇళ్ల కంటే రణ్ బీర్ కపూర్ హౌసే ఖరీదైనది. గత ఏడాది కాలంగా ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో నెలరోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుందట.

ఐదంతస్తుల ఇంట్లో పార్కింగ్, ఆఫీసులు, అత్యాధునిక స్విమ్మింగ్ పూల్, పార్టీ ఏరియా, మల్టిపుల్ బెడ్‌రూమ్‌లు, టెక్నాలజీ ఆధారిత భద్రత, సిబ్బందికి ప్రత్యేక గదులు, ప్రైవేట్ థియేటర్, గార్డెన్ ఏరియా, బాల్కనీ తదితన విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి.

ఇది బాలీవుడ్ సెలబ్రిటీకి చెందిన అత్యంత ఖరీదైన, అత్యంత విలాసవంతమైన ఇల్లు. అందుకే రణబీర్, అలియా తమ కూతురు రాహా పేరు మీద ఈ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించారని టాక్ నడుస్తోంది.