- Telugu News Photo Gallery Cinema photos Prabhas's Spirit Movie Latest News goes viral in social media on march 2024 Telugu Heroes Photos
Prabhas – Spirit: బయటపడుతున్న ప్రభాస్ స్పిరిట్ రహస్యాలు.! తాజా లీక్
యానిమల్ విడుదలై చూస్తుండగానే 4 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు స్పిరిట్ గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు సందీప్ వంగా. అసలు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంతవరకు వచ్చింది..? అనుకున్నట్లుగానే సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ సినిమా ప్రభాస్‌తోనే ఉండబోతుందా..? ఉంటే స్పిరిట్ అప్‌డేట్స్ ఏంటి..? ఎప్పట్నుంచి మొదలు కాబోతుంది..? ఎంతసేపూ అయితే కల్కి.. లేదంటే రాజా సాబ్ అంటూ రెండు సినిమాల గురించే అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి.
Updated on: Mar 31, 2024 | 6:36 PM

యానిమల్ విడుదలై చూస్తుండగానే 4 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు స్పిరిట్ గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు సందీప్ వంగా. అసలు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంతవరకు వచ్చింది..?

అనుకున్నట్లుగానే సందీప్ రెడ్డి వంగా నెక్ట్స్ సినిమా ప్రభాస్‌తోనే ఉండబోతుందా..? ఉంటే స్పిరిట్ అప్‌డేట్స్ ఏంటి..? ఎప్పట్నుంచి మొదలు కాబోతుంది..?

ఎంతసేపూ అయితే కల్కి.. లేదంటే రాజా సాబ్ అంటూ రెండు సినిమాల గురించే అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండూ సెట్స్‌పై ఉండటంతో ఎక్కువగా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ రెండింటితో పాటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా జరుగుతుంది. కాకపోతే అప్‌డేట్స్ ఇవ్వట్లేదంతే.. కానీ సందీప్ వంగా అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో బిజీగా ఉన్నారు.

ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మరోవైపు రాజా సాబ్‌ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నారు ప్రభాస్. వీటి తర్వాతే స్పిరిట్ సెట్స్‌పైకి రానుంది.

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా స్పిరిట్ అనౌన్స్ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని చూస్తున్నారు సందీప్ వంగా. యానిమల్ సినిమాతో సందీప్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. స్పిరిట్‌లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ చెప్తానంటున్నారు వంగా.

ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్, మృణాళ్ ఠాకూర్, రష్మిక మందన్న పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ పూర్తిగా మేకోవర్ అవుతున్నారు. 2025 దసరాకు స్పిరిట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.





























