Tillu Square: బాక్సాఫీస్ రికార్డులపై డిజే టిల్లు దండయాత్ర.. కలెక్షన్ల జోరు!
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్' మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కల్ట్ ఫేవరేట్ 'డీజే టిల్లు'కు సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్స్ అభిమానుల్లో అంచాలను రేకెత్తించాయి.
Updated on: Mar 31, 2024 | 12:14 PM

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్' మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కల్ట్ ఫేవరేట్ 'డీజే టిల్లు'కు సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్స్ అభిమానుల్లో అంచాలను రేకెత్తించాయి.

పబ్లిక్ హాలిడే అయిన గుడ్ ఫ్రైడే రోజున విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యింది. యూత్ లో క్రేజ్ సంపాదించుకుంది.

పెద్దగా రిలీజ్ లు లేకపోవడంతో 'టిల్లు స్క్వేర్' కు అడ్వాంటేజ్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే కలెక్షన్లను నమోదు చేసింది. ఒక్క యూఎస్ లోనే ఈ చిత్రం ప్రీమియర్స్ తో సహా తొలిరోజు 1.2 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇండియాలో ఈ సినిమా తొలిరోజు దాదాపు రూ.23 కోట్లు రాబట్టింది.

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'టిల్లు స్క్వేర్'కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మున్ముందు భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.

సినిమా విడుదల రోజున హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ లో నటీనటులు, సిబ్బంది పాల్గొనగా, ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.