కాగా 'డీజే టిల్లు'గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ.. ఆ మువీకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇక సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. త్వరలో టిల్లు 3 కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.