- Telugu News Photo Gallery Neem oil for Skin: How To Apply Neem Oil On Face For Acne, Follow These Tips And Tricks
Neem Oil For Skin: ముఖంపై మొటిమలు, మచ్చలా.. వేప నూనెను ఇలా అప్లై చేయండి..
వేసవి కాలం వచ్చేసింది. ఉక్కపోత, చెమటతో చికాకుగా ఉండడమే కాదు.. ముఖం మీద జిడ్డు పేరుకుని మొటిమలతో నిండిపోతుంది. మచ్చలు కూడా ఏర్పడతాయి. దీంతో మొటిమలు, మచ్చలను నివారణ కోసం క్రీమ్స్ అప్లై చేస్తారు. ఇందుకోసం చాలా డబ్బు ఖర్చు పెడతారు. అయినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో నిరాశ పడతారు కూడా.. అయితే ఇలా మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడేవారు వేప నూనెను ట్రై చేయండి.
Updated on: Apr 01, 2024 | 9:30 AM

ఫేమ్ జిడ్డుగా మారి మొటిమలు, మచ్చలతో నిండిపోతే.. క్రీమ్స్ బదులుగా సహజమైన పద్దతిలో చిట్కాలను ట్రై చేసి చూడండి. వేపనూనె, ముల్తానీ మిట్టి, తులసి పొడిని కలిపి మిశ్రంగా చేసి ముఖానికి అప్లై చేయండి. అప్పుడు మార్పును గమనించవచ్చు.

వేపనూనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.

అంతేకాదు వేప నూనెలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. మానవులు శతాబ్దాలుగా వేపనూనెను అందం కోసం ఆరోగ్యం కోసం ఉపయోగిస్తున్నారు.

ముఖం మీద మొటిమలను పోగొట్టడమే కాదు పొడి చర్మం, ముడతలు, చర్మపు మచ్చలు, దురద, అలర్జీ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.

వేప నూనె చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా , ప్రకాశవంతంగా ఉంచడానికి కొల్లాజెన్ అవసరం. అంతేకాదు రకరకాల చర్మ సమస్యలను నయం చేయడానికి వేప నూనెను ఉపయోగించవచ్చు.

వేప నూనె రాసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో 2 నుంచి 3 చెంచాల వేపనూనె తీసుకుని దూది సహాయంతో ముఖానికి పట్టించాలి.

ఇలా వేప నూనె రాసి ముఖాన్ని రాత్రంతా అలా ఉంచండి. ఉదయాన్నే లేచి కడుక్కోవాలి. అవసరమైతే, కొద్దిగా వెచ్చని నీటిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.




