Dhanteras 2024: ధన త్రయోదశి రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఎందుకంటే

ధన్తేరస్ లేదా ధనత్రయోదశి పండుగ.. దీపావళి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండగలో మొదటి పండగ. ఆరోగ్యం, సంపద, ఆనందం కోసం ధన త్రయోదశిని జరుపుకుంటారు. చాలా మంది అదృష్టాన్ని ఆహ్వానించడానికి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఈ రోజున కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తే దురదృష్టం కలుగుతుందని కష్టాలు, ఇబ్బందులు ఏర్పడతాయని నమ్మకం. సానుకూల శక్తిని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాలను కొనసాగించడానికి ధన త్రయోదశి రోజున కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం

|

Updated on: Oct 28, 2024 | 8:05 AM

ఇనుము, పదునైన వస్తువులు: ఇనుముతో తయారు చేసిన వస్తువులను లేదా కత్తులు, కత్తెరలు, గొడ్డలి వంటి పదునైన వస్తువులను కొనవద్దు. ఎందుకంటే అవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. ఆర్ధిక శ్రేయస్సుకు అడ్డంకులు కలిగిస్తాయని నమ్ముతారు. ఇనుము శనిశ్వరుడితో సంబంధం కలిగి ఉంటుంది. కనుక ఇనుముకు బదులుగా శాంతి మరియు సమృద్ధిని ప్రోత్సహించే వస్తువులను ఎంచుకోండి.

1 / 7
నలుపు రంగు వస్తువులు: నలుపు రంగు చీకటిని, దురదృష్టాన్ని సూచిస్తుంది. కనుక దుస్తులు, పాత్రలు లేదా అలంకరణకు ఉపయోగించే వస్తువులను నలుపు రంగు వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండండి. దీపావళి పండగ ను చీకటి నుంచి కాంతికి పయనం.. చీకటిపై కాంతి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. కనుక సానుకూల శక్తిని, శ్రేయస్సును ఆకర్షించడానికి ఎరుపు, బంగారం లేదా తెలుపు వంటి శక్తివంతమైన రంగులను ఎంచుకోండి.

2 / 7
ఉపయోగించిన లేదా సెకండ్ హ్యాండ్ వస్తువుల: ఉపయోగించిన లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనవద్దు. ఎందుకంటే అవి గత యజమానుల నుండి దీర్ఘకాలిక ప్రతికూల శక్తిని కలిగి ఉండవచ్చు. ధన త్రయోదశి అనేది కొత్త ప్రారంభానికి గుర్తుగా జరుపుకునే రోజు. ఈ రోజున కొత్త వస్తువులను కొనుగోలు చేయడం అనేది జీవితంలో శ్రేయస్సు, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుందని నమ్మకం.

3 / 7
నీలి రత్నాలు: నీలి రత్నాలు (నీలం) లేదా ఇనుప విగ్రహాలు వంటి శనిశ్వరుడికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం వలన జీవితంలో సవాళ్లు , చేపట్టిన పనులో అడ్డంకులను తీసుకువస్తుంది. బదులుగా అదృష్టాన్ని ప్రోత్సహించే సానుకూల గ్రహ ప్రభావాలకు సంబంధించిన అంశాలను ఎంచుకోండి.

4 / 7
విరిగిన లేదా గాజు వస్తువులు: ధన త్రయోదశి రోజున విరిగిన లేదా లోపభూయిష్ట వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదు. విరిసిన వస్తువులు కొనుగోలు చేయడం లోపాలను, ఎదురుదెబ్బలను ఆకర్షిస్తుంది. ఈ రోజు కొత్త ప్రారంభానికి ప్రతీక.. కనుక దోషరహితమైన.. అదృష్టానికి చిహ్నమైన వస్తువులను కొనుగోలు చేయండి. తాజా ప్రారంభాన్ని ప్రతిబింబిస్తుంది. జీవితంలో పరిపూర్ణతను ఆహ్వానించేలా వస్తువుల కొనుగులు చేయండి.

5 / 7
మద్య పానీయాలు లేదా మత్తు పదార్థాలను కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే అవి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. కనుక ధన త్రయోదశి రోజున వీటిని కొనుగోలు చేయడం  అశుభకరంగా పరిగనించబడుతుంది. ఈ పవిత్రమైన రోజు ధన్వంతరి, లక్ష్మీ దేవిని పూజించడం కోసం కేటాయించబడింది. కనుక స్వచ్ఛతను కాపాడుకోండి. శ్రేయస్సుపై దృష్టి పెట్టండి.

6 / 7
ఆయుధ సామగ్రి: ధన త్రయోదశి శాంతి, శ్రేయస్సులకు సంబంధించిన పండుగ. కనుక హింసను ప్రోత్సహించే ఆయుధాలు లేదా వేట సామాగ్రి వంటి వస్తువులను కొనుగోలు చేయవద్దు. అందుకు బదులుగా, ప్రేమ, కరుణ, సానుకూలతను ప్రసరింపజేసే వస్తువులను కొనుగోలు చేయండి.

7 / 7
Follow us