ధన త్రయోదశి రోజున వెండి, బంగారం మాత్రమే కాదు ధనియాలు కొనడం కూడా మంచిదే.. ఎందుకంటే

ధనియాలు వాసనకు, రుచికి పొంతన ఉండదు. వంటగదిలోని పోపుల పెట్టెని చూస్తే, పసుపు, కారంతో పాటు ధనియాలు ఈ మూడు మసాలాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. బిర్యానీ, కూరగాయలు లేదా సూప్ తయారు చేస్తుంటే ఖచ్చితంగా ఈ మూడు మసాలా దినుసులను ఉపయోగిస్తారు. అయితే మనం ఉపయోగించే అన్ని మసాలా దినుసులలో ధనియాలు బహుశా సతతహరితమైనది. ధన త్రయోదశి రోజున బంగారం, వెండి వస్తువులను కొనడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తారు. అయితే ఈ రోజున ధనియాలు కొనుగోలు చెయాడం చాలా శుభప్రదమని తెలుసా..

ధన త్రయోదశి రోజున వెండి, బంగారం మాత్రమే కాదు ధనియాలు కొనడం కూడా మంచిదే.. ఎందుకంటే
Dhanvantari Trayodashi
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2024 | 9:25 AM

ధనియాలు ప్రత్యేకమైన సువాసన కారణంగా దాదాపు ప్రతి భారతీయ వంటలలో ఉపయోగించబడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గుండ్రని లేత గోధుమరంగులో ఉండే ధనియాలు తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు.. అవి ఆరోగ్య కోణం నుండి కూడా అధిక ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి. ఆయుర్వేదంలో ధనియాల ప్రయోజనాల గురించి ప్రస్తావించబడింది. అంతేకాదు దీపావళి వంటి హిందువుల అతిపెద్ద పండుగ ధన త్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. ధన త్రయోదశి రోజున బంగారం, వెండి వస్తువులను కొనడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తారు. అయితే ఈ రోజున ధనియాలు కొనుగోలు చెయాడం చాలా శుభప్రదమని తెలుసా..

అయితే ధనియాల గురించి తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే.. భారత ఉపఖండం, ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాలు తప్ప ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ప్రజలు ధనియాలను అంతగా ఇష్టపడరు. అయితే ధనియాల చరిత్ర.. దీని పోషకాలు.. అసలు ధనియాలను ఎందుకు ఇష్టపడరో ఈ రోజు తెలుసుకుందాం..

వేల సంవత్సరాల చరిత్ర ధనియాల సొంతం..

ధనియాలను భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది వేదాలు, ప్రాచీన సంస్కృత గ్రంథాలలో (క్రీస్తుకు ముందు 1500, 6 వేల సంవత్సరాల మధ్య వ్రాయబడినవి) ప్రస్తావించబడింది. శతాబ్దాలుగా భారతదేశంలో ధనియాలను ఔషధంగా, ఆరోగ్య మూలికగా ఉపయోగిస్తున్నారు. క్రైస్తవ మత పుస్తకమైన బైబిల్‌లో కూడా ధనియాల ప్రస్తావన ఒక చోట ఉంది. ఇక ధనియాల పోషకాల్లోకి వెళ్తే..

ఇవి కూడా చదవండి

ధనియాలు ఒక మూలిక లాంటిది

భారతదేశంలో ధనియాలు ఒక మూలిక కంటే తక్కువ కాదు. WebMd ప్రకారం పచ్చి ధనియాల్లో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ధనియాలు కొలెస్ట్రాల్, అధిక బీపీ, మధుమేహం,ఆందోళన లక్షణాలను తగ్గిస్తాయి. అంటే ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.

ధన త్రయోదశి రోజున కొనుగోలు చేయడం శ్రేయస్కరం

దీపావళి పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ధన త్రయోదశి రోజున కొత్త వస్తువులను కొనడం ప్రత్యేక ప్రాముఖ్యతగా పరిగణించబడుతుంది. ఈ వస్తువుల్లో ధనియాలు ఒకటి. లక్ష్మీదేవికి ధనియాలు చాలా ప్రీతికరమైనవని నమ్ముతారు. ధార్మిక దృక్కోణంలో ధనియలను కొనుగోలు చేసి ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆర్థిక లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని నమ్ముతారు. ధనియాల్లో ఇంత ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నప్పటికీ కొంత మంది ప్రజలు ఎందుకు ద్వేషిస్తారంటే?

ఇంటర్నేషనల్ హేట్ కొరియాండర్ డే

చెఫ్‌లు ఎప్పుడూ ప్రశంసించడంలో అలసిపోని మూలికను కూడా ఒక వర్గం ప్రజలు అసహ్యించుకుంటారు. ఇంటర్నేషనల్ ఐ హేట్ కొత్తిమీర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న జరుపుకుంటారు. ఇది 2013 సంవత్సరంలో ఫేస్‌బుక్ గ్రూప్‌తో ప్రారంభమైంది. కొత్తిమీరను ఇష్టపడని వ్యక్తులు కొత్తిమీర రుచిసామన్లు తోముకొనే సబ్బులా ఉంటుందని, దుమ్ము లేదా కీటకాల వంటి రుచిని కలిగి ఉంటారు. కొరియాండర్ అనే ఆంగ్ల పదం కొరిస్ అనే గ్రీకు పదం నుండి వచ్చిందని.. అంటే ‘బెడ్‌బగ్’ అని అర్థ. కొత్తి మీరకు ఉన్న చేదు వాసన కారణంగా ఈ పేరు వచ్చింది.

సబ్బు వాసన ఎందుకు వస్తుందంటే

నిజానికి కొత్తిమీర సబ్బు వాసన వెనుక ఒక జన్యువు ఉంది. OR6A2 అనే ఈ జన్యువు అధిక కార్యాచరణ కారణంగా ఇది జరుగుతుంది. కొత్తిమీరను ద్వేషించే వారిలో ఆస్ట్రేలియాతో పాటు యూరప్‌లోని కొన్ని ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

అంత్యక్రియలలో ధనియాల వాడకం

క్రీస్తుపూర్వం 1550కి ముందు, రోమన్లు మృతదేహాలను పాతిపెట్టడానికి ధనియాలను ఉపయోగించేవారు. ధనియాలను వాడితే మృతదేహాల వాసన పోతుందని నమ్మకం.

జాతీయ మూలికల స్థితి

2022 సంవత్సరంలోభారతదేశపు ప్రసిద్ధ చెఫ్ రణబీర్ బ్రార్ ధనియాలకు జాతీయ మూలిక హోదా ఇవ్వాలని పిటిషన్‌ను వేశారు. ఆయన ప్రచారం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. తము ధనియాలను నీటి కాలువ దగ్గర విసిరేవాళ్లమని.. కొత్తిమీర దానంతట అదే పెరుగుతుందని చెఫ్ రణవీర్ బ్రార్ చెప్పారు. తర్వాత కొత్తిమీరను తెంచి ఇంటికి తీసుకొచ్చి ఆహారంలో వాడుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. అయితే కొత్తిమీరకు జాతీయ వనమూలిక హోదా ఇవ్వడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

తెల్లారేసరికి కాలేజీ ఆవరణలో భయంకర సీన్.. అమ్మాయిలు చూడగా..
తెల్లారేసరికి కాలేజీ ఆవరణలో భయంకర సీన్.. అమ్మాయిలు చూడగా..
ఇంటి వరండాలో వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా
ఇంటి వరండాలో వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా
ఆ దేశంలో శృంగార మంత్రిత్వశాఖ ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
ఆ దేశంలో శృంగార మంత్రిత్వశాఖ ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
యుద్ధం చెయ్యమని పంపిస్తే.. నీలి చిత్రాలు చూస్తున్నారు.! వీడియో
యుద్ధం చెయ్యమని పంపిస్తే.. నీలి చిత్రాలు చూస్తున్నారు.! వీడియో
ముంచుకొస్తున్న మరో గండం.! రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.
ముంచుకొస్తున్న మరో గండం.! రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.
బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగ
బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగ
వామ్మో.. కట్టలు కట్టలుగా పాములు ఒకేసారి.! విశాఖ సిటీ షేక్..
వామ్మో.. కట్టలు కట్టలుగా పాములు ఒకేసారి.! విశాఖ సిటీ షేక్..
ఊహించని విధంగా హరితేజ ఎలిమినేట్. కానీ రెమ్యునరేషన్‌ అన్ని లక్షలా?
ఊహించని విధంగా హరితేజ ఎలిమినేట్. కానీ రెమ్యునరేషన్‌ అన్ని లక్షలా?
చావు కళ్ల ముందే స్పష్టంగా కనిపించింది..!
చావు కళ్ల ముందే స్పష్టంగా కనిపించింది..!
నేను పెళ్లి చేసుకోవాలా.? వద్దా.? ఆయన వల్లే పెళ్లి చేసుకోలేదా.?
నేను పెళ్లి చేసుకోవాలా.? వద్దా.? ఆయన వల్లే పెళ్లి చేసుకోలేదా.?