ధనత్రయోదశి రోజున వీటికి దూరంగా ఉండండి.. ఈ రోజున ఏమి చేయాలో? ఏమి చేయకూడదో తెలుసా

ధన త్రయోదశి రోజున ధన్వంతరిని ఆరాధించడంతో పాటు లక్ష్మీదేవి ,  గణేషుడిని కూడా పూజిస్తారు . ఇలా చేయడం వలన లక్ష్మీగణపతిల అనుగ్రహం కుటుంబ సభ్యులపై ఉంటుంది. ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. అలాగే ధన్వంతరికి కూడా కోపం రావచ్చు. అటువంటి పరిస్థితిలో ధన త్రయోదశి రోజున ఏమి చేయాలి?  ఏమి చేయకూడదో.. ఈ రోజున తెలుసుకుందాం.

ధనత్రయోదశి రోజున వీటికి దూరంగా ఉండండి.. ఈ రోజున ఏమి చేయాలో? ఏమి చేయకూడదో తెలుసా
Dhantrayodashi
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2024 | 6:27 AM

హిందూ మతంలో ప్రతి మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దాదాపు ప్రతి నెలలో ఏదొక పండుగ వస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి .  ఈ దీపావళి పండగను అనేక ప్రాంతాల్లో ఐదు రోజులు జరుపుకుంటారు, ఇందులో ధన త్రయోదశి కూడా ఒకటి. ధన త్రయోదశి పండుగతో దీపాల పండుగ ప్రారంభమవుతుంది. ఈ దీపాల పండుగ 5 రోజుల పాటు జరుగుతుంది. వేద క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి రోజున ధన త్రయోదశిగా  జరుపుకుంటారు. ఎవరైతే ధన్వంతరిని హృదయపూర్వకంగా ఆరాధిస్తారో.. వారి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం ఉంటుందని మత విశ్వాసం.

ధన త్రయోదశి రోజున ఏమి చేయాలంటే..

  1. ధన త్రయోదశి రోజున ధన్వంతరిని శుభ సమయంలో పూజించండి.
  2. ధన త్రయోదశి రోజున, బంగారం, వెండి లేదా మట్టితో చేసిన లక్ష్మీ దేవి, గణేశుడి విగ్రహాలను తీసుకురండి.
  3. ధన త్రయోదశి రోజున కొత్త వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
  4. ధన త్రయోదశి రోజున పేద ప్రజలకు దానం చేయండి.
  5. ఇవి కూడా చదవండి
  6. ధన త్రయోదశి రోజు నుంచి అన్నాచెల్లెళ్ల పండగ రోజు సాయంత్రం వరకూ రోజూ సాయంత్రం దీపాలు వెలిగించండి.
  7. ధన త్రయోదశి  రోజున చీపురు, ధనియాలు, ఇత్తడి పాత్రలు కొనడం శుభప్రదంగా భావిస్తారు.
  8. ధన త్రయోదశి రోజున ఇంటిని శుభ్రం చేసి ఇంటిని దీపాలతో అలంకరించండి.

ధన త్రయోదశి రోజున ఏమి చేయకూడదంటే

  1. ధన త్రయోదశి రోజున ఇంటిని మురికిగా ఉంచవద్దు. శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.
  2. ధన త్రయోదశి రోజున చెడు ఆలోచనలు మనసులో పెట్టుకోవద్దు.
  3. ధన త్రయోదశి రోజున ఎవరితోనూ తప్పుగా మాట్లాడకండి.
  4. ధన త్రయోదశి రోజున పెద్దలను, మహిళలను అవమానించకండి.
  5. ధన త్రయోదశి రోజున అశుభకరమైన వస్తువులు కొనకూడదు. ముఖ్యంగా గాజు పాత్రలు కొనకూడదు.
  6. ధన త్రయోదశి రోజున మాంసాహారం, మద్యం, తామసిక ఆహారాన్ని తినకూడదు.

ధన త్రయోదశి రోజున ఏమి కొనుగోలు చేయాలి?

ధన త్రయోదశి రోజున బంగారం లేదా వెండి, లక్ష్మీగణేశుడి విగ్రహాలు, పాత్రలు, చీపుర్లు, ధనియాలు  మొదలైన వాటిని కొనుగోలు చేయాలి. ఈ రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం ద్వారా ధన్వంతరి ,  లక్ష్మీ దేవి ఆశీస్సులు వ్యక్తిపై ఎల్లప్పుడూ ఉంటాయని ఒక మత విశ్వాసం. అలాగే డబ్బుకు కొరత ఎప్పుడూ ఉండదని నమ్మకం .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)