Kubera Temple: కుబేరుడుకి ఆలయం.. దర్శనంతోనే ఆర్థిక ఇబ్బందులు తీరతాయని నమ్మకం..

యక్షులకు రాజు సంపదకు అధిపతి కుబేరుడు.. సిరులను ఇచ్చే కుబేరుడికి మన దేశంలో ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎప్పుడూ తాళం వేసి ఉండదు. ధన త్రయోదశి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు: హిందూ మతంలో ధన త్రయోదశి పండుగను షాపింగ్ చేయడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ధన త్రయోదశి రోజున ధన్వంతరిని, లక్ష్మీదేవిని పూజించడంతోపాటు కుబేరుని పూజించే సంప్రదాయం ఉంది. అటువంటి కుబేరుడి దేవాలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం

Kubera Temple: కుబేరుడుకి ఆలయం.. దర్శనంతోనే ఆర్థిక ఇబ్బందులు తీరతాయని నమ్మకం..
Kubera Temple
Follow us

|

Updated on: Oct 28, 2024 | 7:15 AM

ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ ప్రారంభానికి గుర్తుగా ధన్‌తేరస్ పండుగను భావిస్తారు. దీనినే ధనత్రయోదశి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం దీపావళికి రెండు రోజుల ముందు ఈ పండగను  జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌ 29న ధన త్రయోదశి పండుగ వచ్చింది. ఈ రోజున ప్రజలు ఆయుర్వేద వైద్యుడు ,  ఆరోగ్య ప్రధాత అయిన ధన్వంతరిని పూజిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ధన త్రయోదశి  రోజున వెండి, బంగారు వస్తువులు, పాత్రలు,చీపురులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.

ధనత్రయోదశి రోజున ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడిని పూజించే సంప్రదాయం ఉంది.  అయితే మన దేశంలో అనేక ఆలయాలున్నాయి. శివుడు, కృష్ణుడు ,  హనుమంతుడు వంటి దేవుళ్లతో పాటు అమ్మవారికి కూడా ఆలయాలున్నాయి. అయితే సంపదకు అధినేత కుబేరుడి కూడా మన దేశంలో ఆలయం ఉందని తెలుసా..! ఇక్కడ గర్భగుడికి ఎప్పుడూ తాళం వేయరు. ధన త్రయోదశి సందర్భంగా ఈ రోజు కుబేరుడి ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం..

శివ పార్వతులతో పాటు కుబేరుడి ఆలయం

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లోని ఖిల్చిపూర్‌లో కుబేరుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో  కుబేరుడితో పాటు శివ పార్వతులు భక్తులతో పూజలను అందుకుంటున్నారు. దీంతో కుబేరుడు పూజలందుకుంటున్న ఏకైక ఆలయంగా ప్రసిద్ధిగాంచింది.

ధన త్రయోదశి రోజున ఈ ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు తంత్రపూజ ఆనవాయితీగా వస్తోంది. దీని తర్వాత భక్తులు కుబేరుడి దర్శనం ఇస్తాడు. ఇక్కడ పూజలు చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

గర్భాలయానికి ఎప్పుడూ తాళం వేయరు

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ ప్రతిష్టించిన శిల్పాలు 1300 సంవత్సరాల నాటివని.. అంటే ఖిల్జీ సామ్రాజ్యానికి పూర్వం ఉన్నవని చెబుతారు. అదే సమయంలో ఈ ఆలయ గర్భగుడికి ఇప్పటి వరకు తాళం వేయలేదని ఈ ఆలయ పూజారులు చెబుతున్నారు. ఈ గర్భాలయానికి తలుపు కూడా ఉండేది కాదు. ఈ ఆలయంలో నాలుగు చేతులతో కూడిన కుబేరుడి విగ్రహం ఉంది. ఒక చేతిలో డబ్బుల కట్ట, మరో చేతిలో ఆయుధం, మిగిలిన చేతిలో కప్పు ఉన్నాయి. అలాగే కుబేరుడు ముంగిసపై స్వారీ చేస్తున్నాడు.

దర్శనంతోనే కోరిక నెరవేరుతుందని నమ్మకం

ఈ ఆలయాన్ని మరాఠాల కాలంలో నిర్మించారని కూడా చరిత్రకారులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ ఆలయంలో ఉన్న కుబేరుడి విగ్రహం గుప్తుల కాలం నాటి 7వ శతాబ్దంలో తయారు చేయబడింది. ఈ కుబేరుడి ఆలయాన్ని ఒక్కసారి దర్శించి ఇక్కడ ఉన్న కుబేరుడిని పూజిస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతారు. దీంతో కోరుకున్న కోరిక నెరవేరతాయని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో..  కుబేరుడి ఆశీస్సులు పొందాలనుకునే వారు ధన త్రయోదశి రోజున కుబేరుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో ఈ ఆలయానికి చేరుకుంటారు .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)